Wednesday, January 26, 2022

ఏంటి సార్..! మర్యాదలు పాటించరా..!

ఏంటి సార్..! మర్యాదలు పాటించరా..!

తెలంగాణలో నియంతృత్వం..సీఎం కేసీఆర్ నియంత పోకడలు..ఇది తరచూ ప్రతిపక్షాలు చేసే ఆరోపణే. అంతేకాదు..ఇక్కడ నడిచేది కల్వకుంట్లవారి రాజ్యాంగమని రేవంత్ రెడ్డిలాంటి నేతలు సెటైర్లు వేయటం కూడా చూస్తుంటాం. మరి వినీవినీ అదే నిజమనుకున్నారో ఏమో..!వాళ్లన్నంత పనీ చేస్తున్నారు కేసీఆర్ అని..రాజకీయ విమర్శకులు అంటున్నారు. అందుకు నిదర్శనం గణతంత్ర దినోత్సవమని అంటున్నారు.


గణతంత్ర దినోత్సవం..దేశం అంతా ఘనంగా జరుపుకునే పండగ. కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి కారణం రాజభవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాకపోవడమే అని చెప్పుకోవచ్చు.అయితే.. సీఎం సహా టీఆర్ఎస్ మంత్రులు కూడా హాజరు కాక పోవడంతో పలువురిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకు హాజరు కాలేదు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.అయితే..ఆగస్టు 15న జరిగే స్వతంత్ర దిన వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతాయి. జనవరి 26 వేడుకలు గవర్నర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇది ఆనవాయితీగా వస్తోంది. దీనికి సీఎం కుడా తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం ఉంది. కానీ.. ఈ సారి వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

రాష్ట్ర సీఎంగా ఉన్న కేసీఆర్.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు వేడుకలకు హాజరు కాకపోవడం.. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థను, గణతంత్ర దినోత్సవాన్ని అవమానించడమే అవుతోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ పైనో, కేంద్రం పైనో కోపం ఉంటే అది రాజకీయంగా చూసుకోవాలి.. అంతే కానీ.. ఈ విధంగా చేయడం మంచిది కాదు అని అంటున్నారు. దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది.

ఈ వేడుకల్లో గవర్నర్ ప్రసంగం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలనే ప్రయత్నం కేసీఆర్ చేశారని,దానికి గవర్నర్ సహకరించలేదని..అందుకే కేసీఆర్, మంత్రులు వేడుకలకు హాజరు కాలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.గవర్నర్ ప్రసంగం వింటే అది నిజమే అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని చెప్పుకొస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.గవర్నర్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రానికి అందించిన సహకారాన్ని ప్రస్తావించారు.

కేంద్రంతో యుద్ధం చేస్తాం అని పదే పదే చెప్తున్నకేసీఆర్..తాజాగా రాజభవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరు కాకపోవడానికి కారణం.. వచ్చే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీని థ్రెట్ చేయాలని కేసీఆర్ వ్యూహం అయి ఉండొచ్చు అని చెప్పుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలను అడ్డం పెట్టుకొని తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాఫ్తు సంస్ధల ద్వారా విచారించి..  ఇబ్బంది పెట్టాలని భావిస్తున్న కేంద్రంపై వత్తిడి తెచ్చి.. తద్వారా బయట పడాలని కేసీఆర్ భావిస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైన కేసీఆర్, మంత్రులు వేడుకలకు హాజరు కాకపోవడం రాజకీయంగా దుమారాన్ని లేపుతోంది అని అంటున్నారు.

No comments:

Post a Comment