డ్రగ్స్ కేసు.. సినిమావాళ్లకు సీవీ ఆనంద్ వార్నింగ్..!
ముంబై డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోనీని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. దేశవ్యాప్తంగా ముఖ్య నగరాలు, పట్టణాలకు ఇతడు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ముంబైలో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
బెంగళూరు, ముంబైలలో డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక గ్యాంగ్ లు ఏర్పాటు చేసుకొని టోనీ.. దందా నడుపుతున్నాడని వివరించారు సీపీ. చాలా రోజులుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. అయితే.. ఎట్టకేలకు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాత్కాలిక వీసా, పాస్ పోర్టుతో టోనీ మన దేశానికి వచ్చి డ్రగ్స్ అమ్ముతున్నాడని తెలిపారు ఆనంద్. వీసా, పాస్‌పోర్ట్ గడువు తీరినా వెళ్లకుండా.. రహస్యంగా ముంబైలో ఉంటున్నట్లు చెప్పారు. ఈస్ట్ అంథేరీలో అతడ్ని గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు.
ఇక సినిమావాళ్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సీవీ ఆనంద్. డ్రగ్స్ వాడే వాళ్లను కట్టడి చేయనంత కాలం దీన్ని అరికట్టలేమని చెప్పారు. సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో పట్టుబడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
No comments:
Post a Comment