Tuesday, January 25, 2022

దేశభక్తి ముందు వెన్ను విరిచే చలి చిన్నబోయింది..!

దేశభక్తి ముందు వెన్ను విరిచే చలి చిన్నబోయింది..!

దేశవ్యాప్తంగా గణతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి రాజ్యాంగం గొప్పతనాన్ని, రాజ్యాంగ నిర్మాత ఆదర్శాలను స్మరించుకున్నారు. అటు, సరిహద్దుల్లో సైనికులు కూడా అట్టహాసంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్నారు. దేశ భక్తి ముందు వెన్ను విరిచే చలిని లెక్క చేయలేదు జవాన్లు.

లద్దాఖ్​లో మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఐటీపీబీ భద్రతా దళాలు గణతంత్ర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వాహించాయి. 15 వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాయి. ఈ సందర్భంగా దేశం కోసం అమరులైన వీరులను సైనికులు గుర్తు చేసుకున్నారు.

అటు.. ఉత్తరాఖండ్ ఔలీలో కూడా ఐటీబీపీ దళాలు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వీరిని హిమవీరులుగా పిలుస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీలు ఉంటాయి. 11 వేల అడుగుల ఎత్తులో స్కేటింగ్ చేస్తూ ఈ వేడుకులు నిర్వహించుకున్నారు. వారు చేసే స్కేటింగ్ విన్యాసాలు కనులపండగగా అనిపిస్తుంది.

ఉత్తరాఖండ్​లోని కుర్మాగావ్ ప్రాంతంలో 12 వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఔరా అనిపించారు ఐటీబీపీ సైనికులు. హిమాచల్ ప్రదేశ్​లో అత్యంత ప్రతికూల వాతావరణంలో ఐటీబీపీ దళాలు రిపబ్లిక్ ఉత్సవాలు అంబరాన్ని అంటేలా నిర్వహించారు. 16 వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ప్రదర్శించారు. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను గుర్తు చేసుకున్నారు.

आईटीबीपी के हिमवीरों का राष्ट्र को नमन


Happy Republic Day from #Himveers of ITBP


From #Ladakh


#RepublicDay2022 

#RepublicDay 

#गणतंत्रदिवस https://t.co/bS1A8pnPlH


No comments:

Post a Comment