70 వేల కోట్ల “మెగా” గుట్టు ఏంటి?
– మెఘా ఇంజనీరింగ్ కు బిగుస్తున్న ఉచ్చు
– ఐటి దాడుల్లో బోగస్ ఇన్వాయిస్ లు
– పెద్ద ఎత్తున దొంగ లెక్కలు
– తెర పైకి 12 వేల కోట్ల జీఎస్టీ ఎగవేత కేసు
– నగదు లావాదేవీల్లో 70 వేల కోట్లు ?
– గోల్ మాల్ గుట్టు రట్టు చేయనున్న తొలివెలుగు
సరిగ్గా ఏడాదిన్నర క్రితం..ఏకంగా 2000 కోట్ల రూపాయల వరకూ నగదు స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ అధికారులు లీకులు ఇచ్చారు.ఆ తరువాత 2 రోజుల్లోనే లెక్కలు క్లోజ్ అయ్యాయి.అందుకు బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.తర్వాత ఈ కేసు ఏమైందో ఎవరికి తెలియదు.ఇప్పుడు మరోసారి మేఘా ఇంజనీరింగ్,ఐఏఎస్ కూతురి పెళ్లి బిల్లుల చెల్లింపు విషయం వెలుగులోకి వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులు అయినా.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల్లో భారీగా లాభాలు ఉండే చిన్న చితక పనులు ఐనా..మేఘనే చేస్తుంది. ఏదైనా సరే మేఘా తెలంగాణ ప్రభుత్వం జేబు కంపెనీ అని అందరికి తెలిసిందే.
కంపెనీ వద్దనుకుంటే తప్పా తెలంగాణలో అన్నిపనులు మెగా కనుసన్నులోనే జరుగుతున్నాయి.దీనివెనుక 70వేల కోట్ల నల్లధనం దాగి ఉందని సమాచారం.ఒక్క షెల్ కంపెనీ తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె పెళ్ళికి 50 లక్షల పైనే ఖర్చు పెట్టిందంటే..మళ్ళీ ప్రభుత్వం రావడానికి టీఆర్ఎస్ కి ఎంత ఫండ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఓ వృద్ధురాలి ఇంటి పై ఆమెకు తెలియకుండానే కంపెనీ ఏర్పాటు చేసి దందా చేస్తున్నారు. అంటే..ఇంకా ఇలాంటి సూటు కేస్ కంపెనీల వ్యవహారం బయటపడాల్సిన అవసరం ఉంది.దీనికి సంబంధించి తొలివెలుగు క్రైమ్ బ్యూరో త్వరలోనే ఇన్వెస్టిగేషన్ కథనాలు రాయబోతోంది. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన హోటల్ లో జరిగిన విందు,వైభోగాల ఖర్చు కోసం ఏకంగా షెల్ కంపెనీలను ఉపయోగించింది మేఘా. అయితే దీనిపై మేఘాతోపాటు రజత్ కుమార్ లు కూడా ఖండనలు ఇచ్చారు.
మేఘా కంపెనీ వివరణ ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు.అదేంటి అంటే కంపెనీ ఉద్యోగులు చేసిన లావాదేవీలతో తమకేమీ సంబంధం అనీ, అయితే ఉద్యోగులు ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లి ఖర్చుకు ఏకంగా 20 నుంచి 25 లక్షలు ఖర్చు పెడతారా? పెడితే గిడితే మేఘాలో ఓ ఉన్నతాధికారికి ఖర్చుపెట్టి ఏమైనా ప్రమోషన్..లేదా వేతనాల ప్రయోజనం పొందుదామనుకుంటాడు.కానీ ప్రభుత్వంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి సొంత నిధులు అంత మొత్తంలో ఎలా ఖర్చు పెడతారు?అసలు ఆ అవసరం ఏ ఉద్యోగికి అయినా ఏమి ఉంటుంది. మెగా ఇంజనీరింగ్ వివరణ అసలు నమ్మశక్యంగా ఉందా?అంటే దొరికిన తర్వాత ఉద్యోగుల పేరు చెప్పి తప్పించుకుంటున్నారనే విషయం స్పష్టం అవుతోంది.అంతే కాదు..ఉద్యోగుల వ్యక్తిగత విషయాలు కంపెనీకి ఏమి సంబంధం అంటూ ప్రశ్నలు వేస్తోంది.
ఇదిలా ఉంటే రజత్ కుమార్ కూడా ఖండిస్తూ బిల్లులు అన్నీ తానే చెల్లించానని చెబుతున్నారు.ఆయన చెప్పిందే నిజం అయితే ఈ మొత్తం బిల్లుల వ్యవహారం తన ఐటి వార్షిక రిటర్న్స్ లో చూపిస్తారా?ఓ ఐఏఎస్ అధికారి హోటల్ గదులు,ఫైవ్ స్టార్ ఆతిధ్యం కోసం ఖరీదైన ప్రాంతం బుకింగ్ కోసం అధికారికంగా 25 లక్షల ఖర్చు పెట్టడం జరిగే పనేనా?అయితే ఇది ఒక్కటే వెలుగులోకి వచ్చింది. ఇలా వెలుగులోకి రాకుండా జరిగే వ్యవహారాలు ఎన్నో. ఐఏఎస్ అధికారుల కుటుంబ సభ్యుల పెళ్లిళ్ళే కాదు బీహార్ తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఐఏఎస్ లు కట్టుకునే ఇళ్లు కూడా బడా బడా నిర్మాణ కంపెనీలే కట్టించిపెడుతున్నాయి. వీటికి కూడా షెల్ కంపెనీలను వాడటమో లేక ఇతర మార్గాల్లోనే పనులు కానిచ్చేస్తున్నారు. అంతే కాదు ఐఏఎస్ లు కోరుకునే అన్ని విలాసాలను కూడా పలు కంపెనీలు సమకూరుస్తున్నాయి. ఈ విషయం కాంట్రాక్ట్ సర్కిల్స్ తోపాటు ఐఏఎస్ వర్గాలు అందరికీ తెలిసినవే.తొలివెలుగు ఫినిక్స్ లాంటి కార్పొరేట్ కంపెనీల బాగోతాన్ని, బినామిలా వ్యవహారం బట్టబయలు చేసింది. అలాగే తొలి వెలుగు మెగా పై కూడా పరిశోధనాత్మక కధనాలను ప్రజల ముందు అతి త్వరలో ఉంచనుంది.
No comments:
Post a Comment