అసైన్డ్ భూమికి శాశ్వత యాజమాన్య హక్కు కల్పించాలి!
నారగొని ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
తెలంగాణలో 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ప్రభుత్వం కనీసం అసైన్మెంట్ చేసిన 20 సంవత్సరాల తర్వాత అయినా శాశ్వత యాజమాన్య హక్కులు ఇవ్వాలి. అంటే.. అమ్ముకునే అవకాశం కల్పించాలి. అప్పుడే ఎవరు అసైన్డ్ భూమిని లాక్కోలేరు. ఇది 14.67 లక్షల మంది రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తుంది. ఇందులో అధికంగా ఎస్సీలు ఉంటారు. కర్నాటక రాష్ట్రంలో 15 సంవత్సరాలకు అమ్ముకునే హక్కు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోనూ 20 సంవత్సరాల తరువాత అమ్ముకునేలా హక్కులు త్వరలోనే ఇయ్యబోతున్నారు. తెలంగాణలో కూడా ఇది అమలు చేయాలి.
No comments:
Post a Comment