Tuesday, January 4, 2022

ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే ఎక్కువ పేదరికం - నీతి ఆయోగ్ నివేదిక : ప్రెస్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే ఎక్కువ పేదరికం - నీతి ఆయోగ్ నివేదిక : ప్రెస్ రివ్యూ

Courtesy by BBC తెలుగు మీడియా ట్విట్టర్ 
పోషకాహారలోపం

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే పేదరికం ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్‌ నివేదికలు తెలిపినట్లు 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

''భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి అయోగ్‌ మొదటిసారిగా రూపొందించిన జాతీయ బహువిధ దారిద్య్ర సూచిక(నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ - ఎన్‌ఎంపీఐ) ఈ విషయాన్ని పేర్కొంది.

పేదరికంలో దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ 20వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది.

తెలంగాణలో గతంలోని పది జిల్లాల ఆధారంగా పేదరికాన్ని అంచనా వేయగా, ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

అయితే, ఈ నివేదికను నీతి అయోగ్ 2015-16లో తయారైన 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌‌హెచ్ఎస్‌)' వివరాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించింది.

ఇందుకు ప్రధానంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, జీవన ప్రమాణాలు వంటి నాలుగు రంగాలను ప్రాతిపదికగా చేసుకుని ప్రజల స్థితిగతులను తెలుసుకుంది.

ఇక వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పోషకాహారం, చిన్నపిల్లల, శిశు మరణాలు, తల్లుల ఆరోగ్యం, విద్యారంగంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లిన కాలం, హాజరు శాతం, జీవన ప్రమాణాలకు సంబంధించి వంటనూనెలు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు, గృహ వసతి, ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు వంటి 12 అంశాల ఆధారంగా పేదరికాన్ని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది.

దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 700కు పైగా జిల్లాల్లో ప్రజల స్థితిగతులు, జీవన ప్రమాణాలు, పేదరికపు ఛాయలను ఎత్తి చూపింది.

దీని ప్రకారం.. పేదరిక సూచీలో దేశంలోనే బిహార్‌ రాష్ట్రం 51.91 శాతంతో మొదటి స్థానంలో ఉంది. పేదరికం అతి తక్కువగా కేరళలో (0.71 శాతం) ఉన్నట్లు నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొన్నట్లు'' ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

No comments:

Post a Comment