రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనపై రాష్ట్రమంతా రగిలిపోతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అతని కుమారుడు రాఘవపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. శుక్రవారం కొత్తగూడెం బంద్ కు పిలుపునిచ్చాయి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు.
ఎమ్మెల్యే వనమా రాజీనామా చేయాలని.. రాఘవను అరెస్టు చేసి రౌడీషీట్ ఓపెన్ చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలని.. బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా బంద్ చేపడుతున్నారు.
రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీశాడు. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందో వివరించాడు. వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అతడి వల్లే తమ కుటుంబం ఈ పరిస్థితికి వచ్చిందని వాపోయాడు.
అతడి వల్లే తమ కుటుంబం ఈ పరిస్థితికి వచ్చిందని వాపోయాడు.
మరోవైపు తనకేం పాపం తెలియదని వనమా రాఘవ చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రామకృష్ణ ఆర్థిక పరిస్థితి బాలేకే సూసైడ్ చేసుకున్నాడని.. తనను కావాలనే ఇరికించే ప్రయత్నం చేశారని రాఘవ అందులో చెప్పాడు.
No comments:
Post a Comment