Tuesday, January 18, 2022

తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూ పోతున్నాయి. భాగ్యనగరంలో నమోదవుతున్న కేసులు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,07,904 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,983 మందికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 7,14,639కి చేరింది.

కొత్తగా రెండు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా మృతుల సంఖ్య 4,062కి చేరింది. కోవిడ్ బారి నుంచి తాజాగా 2,706 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 22,472 కొవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో పోలీసులు, వైద్యులు ఎక్కువగా కోవిడ్ బారినపడుతున్నారు. దీంతో అందుబాటులో ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్ పై ఎక్కువగా ఒత్తిడి పడుతోంది.

మరో మూడు వారాలు చాలా కీలకమని.. జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. అందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని అన్నారు. ఎంతమందికి కొవిడ్ వచ్చినా మందులు ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉదంటూ మంత్రి చెప్పుకొచ్చారు.

తెలంగాణలో రెండు కోట్ల కొవిడ్‌ టెస్టింగ్ ఎక్విప్‌మెంట్‌ సిద్ధంగా ఉందన్నారు. అలాగే కోటి మందికి సరిపడే హోం ఐసోలేషన్‌ కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని హరీష్ చెప్పారు. అందరూ కచ్చితంగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని.. వ్యాక్సిన్ పై ఉన్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు.


No comments:

Post a Comment