Sunday, January 2, 2022

గుమ్మడి గింజల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. ఆరోగ్యానికి చాలా అవసరం..

గుమ్మడి గింజల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. ఆరోగ్యానికి చాలా అవసరం..

Courtesy by hmtv media తెలుగు ట్విట్టర్ 

HIGHLIGHTS Pumpkin Seeds: మీరు తరచుగా గుమ్మడికాయలను మార్కెట్లో లేదా పెరట్లో చూసి ఉంటారు. Hmtv Digital Team2 Jan 2022 5:00 PM Pumpkin Seeds: మీరు తరచుగా గుమ్మడికాయలను మార్కెట్లో లేదా పెరట్లో చూసి ఉంటారు. లేదంటే ఇంటి ముందర దిష్టి తీయడానికో లేదా ఆలయాలలో వివిధ అవసరాలకు వాడుతారని మాత్రమే తెలుసు. కానీ గుమ్మడికాయ ఔషధాల గని. ఇందులో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా శాఖాహారులకు ఒక వరమని చెప్పవచ్చు. గుమ్మడి గింజల ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇందులో విటమిన్ ఎ, సి, ఈ, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ మొదలైన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. Also Read - Tea Side Effects: మీ పిల్లలు టీ తాగుతున్నారా.. అయితే ప్రమాదమే..? కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. గుమ్మడికాయ గింజలు మీ రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తాయి. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఈ రక్తనాళాలను బలపరుస్తుంది. రోజూ ఒక చెంచా గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మీ చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలా చేస్తే గుండెకు సంబంధించిన అన్ని సమస్యలు అదుపులో ఉంటాయి. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారు తప్పనిసరిగా గుమ్మడి గింజలను తినాలి. గుమ్మడి గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో కాల్షియం లోపం దీని వినియోగం ద్వారా నెరవేరుతుంది. ఎముకలు దృఢంగా ఉండి బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఆయుర్వేదంలో అన్ని రోగాలకు మూలం ఉదరం. కానీ గుమ్మడికాయ గింజలు పొట్టకు చాలా మంచివి. అవి మన జీర్ణవ్యవస్థను సరిచేయడానికి పని చేస్తాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. విటమిన్ ఎ, ఈ గుమ్మడికాయ గింజలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి కళ్ళకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే జింక్ విటమిన్ కాలేయం నుంచి కంటి రెటీనా వరకు రక్త సరఫరా వేగం చేస్తుంది. ఇది మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కళ్లను రక్షిస్తుంది కళ్లకు రంగును అందిస్తుంది. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది. Web TitleThere are Many Benefits of Pumpkin Seeds Very Good for Health

https://www.hmtvlive.com/life-style/there-are-many-benefits-of-pumpkin-seeds-very-good-for-health-75752#.YdGSQQN7ra0.twitter

https://www.hmtvlive.com/life

No comments:

Post a Comment