Tuesday, January 18, 2022

కారులో ఓవర్ లోడ్.. హ్యాట్రిక్ కు బ్రేక్!

కారులో ఓవర్ లోడ్.. హ్యాట్రిక్ కు బ్రేక్!

trs latest update

– 40 మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్?

– ఎన్నికల నాటికి టీఆర్ఎస్ లో చీలిక తప్పదా?
– బై బై చెప్పేందుకు రెడీగా ఉన్నదెవరు?
– కేసీఆర్ హ్యాట్రిక్ కల నెరవేరడం కష్టమేనా?

ముచ్చటగా మూడోసారి అధికారం కోసం టీఆర్ఎస్ ఆరాటం.. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికార పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ పోరాటం.. ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా.. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అయితే.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న టీఆర్ఎస్ కు ఈసారి గెలుపు అవకాశాలు కష్టమనే అంటున్నారు విశ్లేషకులు. ఓవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. దీనికితోడు గులాబీ ఎమ్మెల్యేలపై ఉన్న ప్రజా వ్యతిరేకత ప్రతిపక్షాలకు కలిసి వస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు.

ఇప్పటికే టీఆర్ఎస్ ఓవర్ లోడ్ అయింది. రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న సమయాల్లో ఇతర పార్టీల నేతలను భారీగా చేర్చుకుంది. దాని ఫలితంగా పార్టీ నేతల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కేసీఆర్ అంటే భయంతో ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నా.. ఎన్నికల టైమ్ నాటికి సీట్ల సర్దుబాటు విషయంలో తలనొప్పులు తప్పవని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. ఇటు తీవ్ర ప్రజా వ్యతిరేకత టీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు జల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇచ్చిన హామీలను, చేసిన పనులను బేరేజు వేసుకుంటే చేసిందేం లేదనే అసంతృప్తి ప్రజల్లో బాగా కనిపిస్తోంది. దీన్ని గ్రహించిన కేసీఆర్.. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరందరికీ నెక్స్ట్ సీట్లు దొరకడం కష్టమనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. అదే గనక జరిగితే పార్టీలో చీలికలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఎన్నికల సమయానికి సీట్ల విషయంలో ఏదైనా తేడా చేస్తే బైబై చెప్పేందుకు చాలామంది గులాబీ నేతలు రెడీగా ఉన్నారని చెబుతున్నారు విశ్లేషకులు.

పార్టీలో ఓవర్ ఫ్లోతో సతమతం అవుతున్న గులాబీ బాస్ కు.. బీజేపీ, కాంగ్రెస్ ఎదురుదాడి కూడా పెద్ద తలనొప్పిగా తయారైంది. ప్రతీ విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా వివరిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. అసలే ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్న ప్రజల్లో ఇది అగ్గికి ఆజ్యం పోసినట్లుగా అవుతోందని అంటున్నారు విశ్లేషకులు. ఈ పరిణామాలన్నీ చూసి కేసీఆర్ హ్యాట్రిక్ కల నెరవేరదని అంచనా వేస్తున్నారు


No comments:

Post a Comment