Friday, January 7, 2022

వనమా రాఘవ: ఏపీ వైపు పారిపోతుండగా అర్ధరాత్రి అరెస్ట్ - ప్రెస్ రివ్యూ

వనమా రాఘవ: ఏపీ వైపు పారిపోతుండగా అర్ధరాత్రి అరెస్ట్ - ప్రెస్ రివ్యూ

Courtesy by BBC తెలుగు మీడియా ట్విట్టర్ 
వనమా రాఘవేంద్ర

ఫొటో సోర్స్,FACEBOOK/VANAMARAGHAVENDRA

భద్రాద్రి జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన వనమా రాఘవేంద్రరావు(రాఘవ)ను పట్టుకున్నట్లు పోలీసులు ప్రకటించారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ఓ వాహనంలో భద్రాద్రి జిల్లా దమ్మపేట మీదుగా ఏపీ వైపు పరారవుతుండగా.. కొత్తగూడెం పోలీసులు చింతలపూడి వద్ద నిఘా పెట్టి పట్టుకున్నట్లు భద్రాద్రి ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.

అయితే విచారణ నిమిత్తం రాఘవను ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తారని, విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది.

ఘటన జరిగినప్పటి నుంచి అతడు పరారీలో ఉండడంతో ఎక్కడ ఉన్నాడన్నది మిస్టరీగా మారిన విషయం తెలిసిందే.

పాల్వంచ పోలీసులు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అరెస్టు చేశారని, కాదు.. కొత్తగూడెంలోనే అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. కానీ, రాఘవను అరెస్టు చేయలేదని, అతని కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని, ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని పేర్కొంటూ భద్రాద్రి ఎస్పీ గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఒక ప్రకటన విడుదల చేశారు.

రాఘవ ముఖ్య అనుచరులిద్దరిని పాల్వంచ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మరోవైపు పాల్వంచ ఫైనాన్స్‌ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో విచారణ కోసం శుక్రవారం మణుగూరు ఏఎస్సీ ఎదుట హాజరు కావాలంటూ గురువారం అర్ధరాత్రి పాత పాల్వంచలోని రాఘవ తండ్రి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసానికి పోలీసులు నోటీస్‌ అంటించారు. కానీ, విచారణకు రాఘవ హాజరు కాలేదు.

మరోవైపు వనమా రాఘవేంద్రను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఇందుకు సంబంధించి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్‌ నూకల నరే్‌షరెడ్డి ప్రకటన చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు’’ అని ఆ కథనంలో రాశారు.

No comments:

Post a Comment