Monday, January 24, 2022

కటకటాల్లోకి కల్వకుంట్ల కుటుంబం..??

కటకటాల్లోకి కల్వకుంట్ల కుటుంబం..?
ఉచ్చుకు ముహూర్తం ఫిక్స్..?
మార్చ్ మూడో వారంలో షురూ
కేసీఆర్ ఫ్యామిలీపై ఈడీ ఫోకస్
ఇటీవల రూ. 2660 కోట్ల ట్రాన్సాక్షన్
అధికారులతో ఆరా మొదలు
వివరాలు సేకరిస్తున్న ఓ ఐపీఎస్
యూపీ ఎలక్షన్స్ తర్వాత టార్గెట్
Courtesy by : Qgroup Media 

శనార్తితెలంగాణ: తెలంగాణ పౌర సమాజం ఎప్పుడెప్పుడా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న కీలక ఘట్టానికి కేంద్రం ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మార్చ్ మూడోవారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అవినీతి వ్యవహారాల చిట్టా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో.. రియల్ ఎస్టేట్ పేరుతో రాష్ట్రంలో ఆర్థిక దోపిడికి తెరలేపిన కేసీఆర్ కుటుంబంపై ఇప్పటికే పూర్తి ఆధారాలు ఈడీ చేతికి అందినట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా ఈ అంశం తెరపైకి వస్తున్నా సరైన సమయం కోసం కేంద్రం వేచిచూసినట్టు.. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చి మూడోవారంలో రంగప్రవేశం చేయబోతున్నట్టు అత్యంత కీలక సమాచారం. కేసీఆర్ అవినీతిని దగ్గరుండి చూసిన కొంతమంది ఐఏఎస్ అధికారులను కేంద్రం డిప్యుటేషన్ పేరుతో ఢిల్లీకి పిలిచే ప్రక్రియను మొదలు పెట్టింది.

విషయం కేసీఆర్ కు తెలిసిపోయింది.
కేంద్రం ఉచ్చుభిగిస్తుందన్న విషయం నిఘావర్గాల ద్వారా తెలుసుకున్న కేసీఆర్.. ఎలాగైనా మళ్లీ ప్రజల అండను కూడగట్టి గట్టెక్కేందుకు ప్రయత్నాలు ఓవైపు మొదలు పెట్టి దళిత బందు.. మన బడి మన ప్రణాళిక పేరుతో ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్రం ఉచ్చుభిగించే సమయంలో ప్రజల నుండి సానుభూతిని పొందెందుకు తంటాలు పడుతున్నాడు.. అయితే మార్చి మూడోవారంలో ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలుసుకున్న కేసీఆర్ ఐఏఎస్ అధికారులను డిప్యూటేషన్ పై తీసుకువెళ్లే విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ లేఖను కూడా వదిలాడు. రాష్ట్రం నుండి డిప్యూటేషన్ పై కేంద్రానికి వెళ్తున్న ఐఏఎస్ లను ఎలాగైనా వెళ్లకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ నానాపాట్లు పడుతున్నాడు. తనకు ఇబ్బంది కలిగిన ప్రతిసారి ప్రజలను రెచ్చగొట్టి బయటపడే కేసీఆర్ కు ఈసారి ప్రజల నుండి అలాంటి సపోర్ట్ దొరికే ఛాన్స్ కనిపించడంలేదు..

ప్రత్యేక నిఘా బృందం
కేసీఆర్ ఫ్యామిలీ కొల్లగొట్టిన సంపద.. వారి బినామీల వ్యవహారంలో కేంద్రం నిఘా బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది.. కేంద్ర సర్వీసులలో పనిచేస్తున్న ఓ ఐపీఎస్ అధికారి నిఘా బృందానికి నేతృత్వం వహిస్తున్నాడు. ప్రతిమా శ్రీనివాసరావు, చిన్నజీయర్ స్వామీ, మై హోం రామేశ్వర్ రావు తో పాటు ఓ రియలెస్టేట్ దిగ్గజ సంస్థ.. ఓ ఫార్మా ఇండస్ట్రీ ఓనర్ వివరాలు సేకరిస్తున్నారు. జనవరి 15నాడు కేంద్ర నిఘాబృందానికి రాష్ట్రంలోని ఓ ఐపీఎస్ అధికారి కొన్ని కీలక ఫైళ్లు అప్పగించినట్టు తెలుస్తుంది.

విదేశాలకు డబ్బుతరలింపు..?
ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీ విదేశాలకు డబ్బులు చేరవేసే పనిమొదలు పెట్టినట్టు పక్కాసమాచారం అందుకున్న కేంద్రం గతకొన్నిరోజులుగా కేసీఆర్ ఫ్యామిలీ విదేశీ టూర్లపై నిఘాపెట్టినట్టు తెలుస్తుంది.. దుబాయ్.. హాంకాంగ్ తో పాటు కొన్ని యూపర్ దేశాల్లో జరిగిన లావాదేవీల వివరాలు రాబడుతున్నట్టు తెలిసింది. వేలాది కోట్ల రూపాయల సంపదను హవాలా రూపంలో కాకుండా మరో రూపంలో నుండి తరలిస్తున్నట్టుగా కేంద్రం సమాచారం సేకరించింది..

డేటా సెంటర్ల పై నిఘా
హైదరాబాద్ లో కొత్తగా కొన్ని డేటా సెంటర్లు రాబోతున్నాయంటూ ఇటీవల కేసీఆర్ కొడుకు చేసిన ప్రకటనకు.. అక్రమ సొమ్ము తరలింపునకు ఉన్న లింకులపై ఆరాతీస్తున్నారు.. రీసెంట్ గా జరిగిన 2660 కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్ సాక్షన్ పై నిఘావెసి ఉంచినట్టు తెలస్తుంది.. డాటా సెంటర్ల పేరుతో హవాలాకు మరో రూపం కనుగొన్నట్టు తెలుసుకున్న కేంద్ర నిఘా సంస్థలు ఆదిశగా ఆధారాలు సేకరింస్తున్నట్టు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తుంది.. మార్చి రెండో వారం కల్లా కేంద్రం చేతికి పూర్తిస్థాయి నివేదిక అందించనున్న నిఘా బృంధం.. మూడో వారంలో కీలక పనికి తెరలేపబోతున్నట్టు సమాచారం.
 

No comments:

Post a Comment