Monday, January 31, 2022

డ్రగ్స్ దందా పాల్పడే వారిపై ఇక చెడుగుడే..... సైబరాబాద్ పోలీసుల స్టాంగ్ వార్నింగ్.....!

*డ్రగ్స్ దందా పాల్పడే వారిపై ఇక చెడుగుడే..... సైబరాబాద్ పోలీసుల స్టాంగ్ వార్నింగ్.....!*

తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా బయటపడుతున్న మాధకద్రవ్యాల ఘటనలపై పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్..ఇకపై రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినిపించకూడదంటూ పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఈక్రమంలో డ్రగ్స్ దందాను కూకటివేళ్లతో సహా ఏరిపారేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సహా హైదరాబాద్ జంటనగరాల్లో డ్రగ్స్ దందాపై తీసుకుంటున్న చర్యల గురించి సైబరాబాద్ *డీసీపీ (క్రైమ్స్) కలమేశ్వర్* వివరించారుఈసందర్భంగా డీసీపీ కలమేశ్వర్ సోమవారం ప్రత్యేకంగామాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘావుంచి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ కలమేశ్వర్ పేర్కొన్నారు. జంట నగరాల పరిధిలోని పబ్స్, రిసార్టులపై ప్రత్యేక నిఘా ఉంచారు పోలీసులు.
ముఖ్యంగా గ్రామాల్లో పంటపొలాల మాటున గంజాయి పండిస్తున్న వారిపై నిఘా ఉంచి.. గంజాయి మూలాల నిర్ములనకు అక్కడి పంచాయతీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు డీసీపీ కలమేశ్వర్ తెలిపారు. డ్రగ్స్ / గాంజాయి సరఫరా చేస్తున్న వారు, ఎవరెవరు ఉన్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? వంటి వివరాల ఆధారంగా ఆయా ప్రదేశానికి ప్రత్యేక బృందాలను పంపించి పూర్తి స్థాయిలో నిర్ములించే దిశగా చర్యలు తీసుకున్నట్టు డీసీపీ వివరించారు.
మాదక ద్రవ్యాలకు యువత బానిసలు కావడంపట్ల ఆందోళన వ్యక్తం చేసిన కలమేశ్వర్.. యువతకి ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలలు, విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. డ్రగ్స్ నియంత్రణపై సూచనలు చేశారు. ఇతర దేశాల నుండి సరఫరా అయ్యే డ్రగ్స్ పై నజర్ పెంచామన్న డీసీపీ కలమేశ్వర్.. డ్రగ్స్/గాంజాయి సరఫరాలపై ఎవరివద్దనైనా సమాచారం ఉంటే “డయల్ 100” ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment