Friday, January 21, 2022

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..?

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..?

రాష్ట్రం, కేంద్రం అనే తేడా లేదు. రాజకీయం ఎప్పుడు ఎలాంటి మలుపుతిరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. భారత్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తది అనే అంశంపైన ఓ సంస్థ సర్వే చేసింది. తన సర్వేలో కీలక విషయాను వెల్లడించింది.

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని.. వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీనే ప్రజలు కోరుకుంటున్నారని “సీ ఓటర్‌ ఇండియా టుడే సంయుక్త సర్వే” తేల్చి చెప్పింది. ఎన్డీయే సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని వెల్లడించింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది.

ఇటు ఏపీ విషయానికి వస్తే.. ఉన్నఫలంగా ఎన్నికలు పెట్టినా మళ్లీ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని సీ ఓటర్‌ ఇండియా టుడే సర్వే తేల్చిచెప్పింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కు ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా రాదని కుండబద్దలు కొట్టింది.

సర్వే విశ్లేషణలో నిపుణులుగా పరిగణించే సీనియర్‌ జర్నలిస్టులు రాహుల్‌ కన్వల్‌, రాజ్‌ చెంగప్పలు ప్రజాదరణ విషయంలో జగన్‌ కు తిరుగులేదని విశ్లేషించారు.

No comments:

Post a Comment