భారత్ లో కరోనా తగ్గుముఖం పట్టేది అప్పుడే..!
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిపై పలు సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ రీసెర్చ్ వైరస్ తీవ్రతపై ఓ సర్వే చేసి నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడి అయ్యాయి. భారత్ లో మరో మూడు వారాల్లో థర్డ్ వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. ఇప్పటికే నగరాల్లో కేసులు పీక్స్ కి చేరుకుంటున్నాయని.. ఇప్పుడు ఈ వైరస్ గ్రామాలకు విస్తరిస్తోందని ఎస్బీఐ సర్వేలో తేలింది.
మనదేశంలో థర్డ్ వేవ్ లో కేసుల పెరుగుదలలో డిసెంబరు 29 నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 64 శాతం జనాభాకు 2 డోసుల టీకా వేయడం పూర్తయ్యింది. టీకాలు తీసుకున్న ప్రజల్లో గ్రామీణ ప్రజలు 83 శాతం ఉన్నారు. వ్యాక్సినేషన్ వేగవంతం అవ్వడం వలన పరిస్థితి ఆందోళనకరంగా లేదని ఈ నివేదికలో వివరించింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, జమ్మూ కశ్మీర్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. మొదటి, రెండు దశలతో పోల్చితే.. ఆస్పత్రుల్లో చేరుతున్నవారు తక్కువగా ఉన్నారని.. మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గిందని తెలుస్తోంది.
కరోనా తీవ్రత ముంబైలో ఎక్కువగా ఉంది. ఈ నెల 7న 20,971 కొత్త కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ లో ఇదే గరిష్ఠ స్థాయి. అక్కడ ఎక్కువగా 30-39 ఏళ్ల వయస్సు వారు కరోనా బారినపడుతున్నారు. కానీ 60- 69 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తున్నారు. ఉంటోంది. ముంబయిలో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరిన 2-3 వారాల్లో జాతీయ గరిష్ఠ స్థాయి నమోదయ్యే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది.
ప్రసుత్తం అమెరికాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ఈ నివేదిక చెబుతోంది. యూఏఈ, చిలీ, సింగపూర్, చైనా దేశాల్లో 80 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో.. అక్కడ కేసులు పెరుగుతున్నా మరణాల సంఖ్య తక్కువగా ఉంది. దక్షిణాఫ్రికా, యూఎస్‌ఏ, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో కేసులు ఇప్పటికే గరిష్ఠ స్థాయి నమోదైంది. ఇప్పుడు నెమ్మదదిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ దేశాల్లో గరిష్ఠ స్థాయి నమోదు కావడానికి సగటున 54 రోజుల సమయం పట్టింది.
No comments:
Post a Comment