Friday, January 21, 2022

డ్రగ్స్ కేసు.. కీలక సమాచారం బయటపెట్టిన టోనీ

డ్రగ్స్ కేసు.. కీలక సమాచారం బయటపెట్టిన టోనీ


ఇటీవల దేశంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దక్షిణ భారతదేశంలో డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాన నిందితుడు నైజీరియాకు చెందిన టోనీని పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అతనితో పాటు.. డ్రగ్స్ వినియోగిస్తున్న ఏడుగురు వ్యాపారులను, ఇద్దరు డ్రైవర్లను న్యాయస్థానం ముందు ఉంచారు. నిందితులందరికీ న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది.

ఈ కేసులో తీగలాగితే డొంక కదిలింది. లోతుగా విచారణ చేస్తే మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ముంబయిలో పట్టు బడిన టోనీని హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ఇక్కడ విచారణ చేయగా పలు కీలక అంశాలు వెల్లడించాడు. హైదరాబాద్​కు చెందిన పలువురు వ్యాపారవేత్తలకు తాను డ్రగ్స్ అమ్మినట్టు చెప్పాడు. నిరంజన్ కుమార్ జైన్, శాశ్వత్ జైన్, యాగ్యానంద్, సుమంత్ రెడ్డి, బండి భార్గవ్, వెంకట్ చలసాని, సాగర్​తో పాటు… ఇద్దరు డ్రైవర్ల పేర్లు చెప్పాడు. పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. మరో నలుగురు వ్యాపారులు పరారీలో ఉన్నట్టు చెప్పారు.

15 రోజులకు ఒకసారి ముంబైలో ఉండే తన బ్యాచ్ ని టోనీ హైదరాబాద్ పంపించేవాడు. సుమారు 60 మంది తరుచూ హైదరాబాద్ కు వచ్చి పోతూ ఉండేవారు. వేలకోట్ల రూపాయాల వ్యాపారం ఈ బ్యాచ్ ద్వారానే జరిగేంది. పోలీసులకు చిక్కకుండా కొత్త కొత్త పందాల్లో టోనీ బ్యాచ్ డ్రగ్స్ సరఫరా చేసేవారు. వ్యాపారవేత్తలకు ఒక గ్రామ్ కోకెన్ ను 20 వేల చొప్పున అమ్మినట్టు సమాచారం. గత నాలుగేళ్లుగా టోనీ దగ్గర్నుంచి హైదరాబాద్ లోని పలువురు వ్యాపారవేత్తలు డ్రగ్స్ తీసుకునేవారని చెప్పాడు. పెద్ద మొత్తంలో వ్యాపారవేత్త నిరంజన్ జైన్ తీసుకున్నట్టు తేలింది. 30 సార్లు టోనీ దగ్గర్నుంచి నిరంజన్ జైన్ డ్రగ్స్ తెప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. వేల కోట్ల వ్యాపారం చేస్తూ డ్రగ్స్ కు ఆయన డ్రగ్స్ కు అలవాటు పడినట్టు చెప్పారు.


No comments:

Post a Comment