“మెగా” రిగ్గింగ్.. ఖజానాకు డ్రిల్లింగ్! ఇటలీ కంపెనీ పేరుతో.. “కృష్ణ” మాయ!
at
– రిగ్గుల కంపెనీ వెనుక రింగ్ మాస్టర్!
– బినామీ కంపెనీలతో బ్లాక్ అండ్ వైట్ గేమ్
– ఠికానా లేని కంపెనీలతో మేఘా కృష్ణ డీలింగ్
– ఓఎన్జీసీ టెండర్లనే గ్రిల్ చేసిన డ్రిల్ మెక్ స్పా
– ఆయిల్ డ్రిల్లింగ్, రిగ్గులతో..
– జేబు కంపెనీకి దోచిపెట్టే ప్రయత్నం!
డ్రిల్ మెక్ స్పా… ఈ పేరు నిన్నటి మొన్నటి వరకు ఎవరికీ తెలియని పేరు. కేటీఆర్, మేఘా కృష్ణారెడ్డి పుణ్యమా అని తెలంగాణ ప్రజలకు పరిచయం అయింది. ఇటలీ కంపెనీ అయిన దీన్ని చేజిక్కించుకున్న మేఘా సంస్థ.. ఇప్పుడు హైదరాబాద్ లో మకాం వేయబోతోంది. అట్టహాసంగా మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఒప్పందాలు జరిగాయి. నగరానికి ఇటలీ కంపెనీ వచ్చేసింది.. 15 వందల కోట్ల పెట్టుబడి రాబోతోంది.. అంటూ కేటీఆర్ చాలా గొప్పగా చెప్పారు. కానీ.. ఇక్కడ తెరవెనుక చాలా తతంగం ఉందని ప్రచారం జరుగుతోంది. మేఘా కృష్ణారెడ్డి సిస్టర్ సంస్థ అయిన ఈ డ్రిల్ మెక్ స్పా బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకే హైదరాబాద్ ని ఎంచుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గొప్పగా చెప్పకుంటున్న ఈ కంపనీ వ్యవహారంపై తొలివెలుగు ఇన్వెస్టిగేషన్ చేసింది. డ్రిల్ మెక్ స్పా మాతృ సంస్థ అయిన ట్రెవీ గ్రూప్ లో ఏం జరిగింది? మేఘా సంస్థ నుంచి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయి? 2015 నుంచి 2018 వరకు ఒక్క డ్రిల్ ని కూడా సప్లై చేయని సంస్థ.. 2018లో ఎలాంటి అనుభవం లేకుండానే మేఘా మేనేజ్ మెంట్ కు 27 డ్రిల్స్ ని ఎందుకిచ్చింది. అదీగాక తక్కువ బిడ్డింగ్ తో ఓఎన్జీసీ టెండర్లు ఎలా దక్కించుకుంది..? ఈ విషయాలన్నింటినీ మీ ముందు తీసుకొస్తోంది తొలివెలుగు.
ఇటలీకి చెందిన డ్రిల్ మెక్ స్పా కంపెనీకి వందేళ్ల చరిత్ర ఉంది. కానీ.. ఎంతో మంది చేతులు మారింది. 60 ఏళ్లుగా మార్కెట్ లో పేరున్న ట్రెవీ గ్రూప్ కి చేరుకుంది. కొద్ది రోజులుగా డ్రిల్లింగ్, రిగ్గుల టెండర్స్ లో యాక్టివ్ గా లేదు. మార్కెట్ లో ఒక్క షేర్ విలువ 0.79 యూరోస్ మాత్రమే ఉంది. కానీ.. 2018లో ఓఎన్జీసీ 27 రిగ్గుల కోసం టెండర్ పిలిచింది. ఈ వేలం పాట కోసమే.. మేఘా సంస్థ డ్రిల్ మెక్ స్పాని ట్రెవీ గ్రూప్ నుంచి చేజిక్కించుకుంది. అందుకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు షేర్ హోల్డర్స్ కి తెలపలేదు. ట్రెవీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కావడంతో ఈ విషయాలు బయటకు పొక్కాయి. ఓ షెల్ కంపెనీతో డబ్బులు మళ్లించి.. డ్రిల్ మెక్ స్పా బ్రాండ్ ని స్వాధీనం చేసుకుంది మేఘా సంస్థ. ఇక్కడ సుమారు 2 వేల కోట్ల బ్లాక్ మనీ చేతులు మారినట్లు అంతర్జాతీయ కంపెనీలు గుసగుసలాడుకున్నాయి. ఒకప్పుడు 400 మంది పనిచేసే ఈ కంపెనీలో మేఘా దక్కించుకునే సమయానికి 100 మంది కూడా లేరు. 2014 నుంచి ఏ దేశానికి డ్రిల్లింగ్ లు, రిగ్గులు సప్లై చేయలేదని సమాచారం. అలాంటి కంపెనీని బ్లాక్ టూ వైట్ కోసమే మేఘా చేతపట్టిందని విమర్శలు ఉన్నాయి.
నల్లధనం తెల్లగా చూపేందుకే గేట్ వే ఓఎన్జీసీ బిడ్డింగ్?
గొప్పల గప్పాలు హైదరాబాద్ లోని భూముల కోసమా.? యూరేనియం కోసమా..?
అసలు తెలంగాణలో రిగ్గుల అవసరమే లేదు. కానీ.. హైదరాబాద్ లో తమ పాలన మెచ్చి ఇటలీ కంపెనీ వచ్చిందని గొప్పలు చెప్పారు మినిస్టర్ కేటీఆర్. ఇది వారి జేబు కంపెనీగా భావించే మేఘా కృష్ణారెడ్డి కంపెనీ అని ఎక్కడా చెప్పలేదు. అంతర్జాతీయ కంపెనీగా ప్రచారం చేశారు. ఇదంతా హైదరాబాద్ లో విలువైన భూములను కొట్టేసేందుకే అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే.. ఆయిల్ డ్రిల్లింగ్, రిగ్గింగ్ సెక్టార్ ఎక్విప్ మెంట్ తెలంగాణకు అవసరం రాబోతోంది. గోదావరి తీరం వెంట నేచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. పరివాహక ప్రాంతంలో ఓఎన్జీసీ ఇప్పటికే సర్వేలు చేపట్టింది. భూగర్భ గనుల్లో నుంచి మిథేన్ వంటి గ్యాస్ వెలికితీసేందుకు ఎప్పటి నుంచో సింగరేణి ప్రయత్నలు చేస్తోంది. అయితే సముద్రంలో నుంచి కాకుండా భూమిపై నుంచి తీసే ఆఫ్ షోర్ వ్యవస్థను మేఘా కంపెనీ తెలంగాణలో తయారు చేయనుంది. ఇదే పెద్ద మొత్తంలో తయారు చేస్తే.. నల్లమలలో యూరేనియంని వెలికి తీసేందుకు ఎంతగానే ఉపయోగపడనుంది. అలా చేస్తే.. రాష్ట్రానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచిఉందని పర్యావరణ వేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అడవుల్లో ఇప్పటికే కేంద్రం బోర్లు వేసి పరిశోధనలు చేస్తోంది. వాటిని ఆపేయాలంటూ ఉద్యమం కూడా ఉవ్వెత్తున ఎగిసింది. కేసీఆర్ అసెంబ్లీలో యూరేనియం తీయనీయమని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ.. ఏ నిర్ణయాల వెనుక ఏవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు మేధావులు.
No comments:
Post a Comment