Tuesday, January 25, 2022

ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజీత్ హత్య సూత్రధారి SDPIకి చెందిన మహ్మద్ హరూన్ అరెస్ట్ – భార్య కళ్లెదుటే సంజీత్ ను పొడిచి చంపిన గూండాలు

ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజీత్ హత్య సూత్రధారి SDPIకి చెందిన మహ్మద్ హరూన్ అరెస్ట్ – భార్య కళ్లెదుటే సంజీత్ ను పొడిచి చంపిన గూండాలు

ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజీత్ హత్యకేసులో ప్రధాన సూత్రధారి మహ్మద్ హరూన్ కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన హరూన్ స్వస్థలం కోజింజంపర సమీపంలోని అథిక్కోడ్.
27 ఏళ్ల సంజీత్ హత్యకు ప్లాన్ చేసింది ఇతడే అని విచారణలో తేలింది. ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ చేశారు. హత్యలో పాల్గొన్నావారిని ఎప్పుడో గుర్తించామని..పరారీలో ఉన్న హరూన్ ను ఇప్పుడు అరెస్ట్ చేశామని పాలక్కాడ్ జిల్లా పోలీసులు తెలిపారు. సంజిత్ ను హత్య చేసిన సుబైర్, సలామ్, ఇసాహక్ ను పోలీసులు 2021 నవంబర్లోనే అరెస్ట్ చేశారు.
హత్యచేశారు. సంజీత్ హత్య వెనక SDPI, ఇస్లామిస్ట్ ఔట్ ఫిట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పాత్ర ఉందని తేలింది. వారిలో సలామ్ కు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హత్యతో ప్రమేయం ఉన్న మరో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టపగలే తన కళ్లముందే భర్తను హత్య చేయడాన్ని చూసిన సంజీత్ భార్య అర్షిక …కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హంతకులలో ఎవరూ ముసుగు ధరించలేదని…వాళ్లని తాను గుర్తిస్తానని… సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గూండాలే నరికి చంపారని పలుమార్లు వాపోతూ చెప్పింది. స్వగ్రామం ఎల్లపుల్లి సమీపంలోనే ఉదయం తొమ్మిదన్నరకు ఎస్డీపీఐ గూండాలు భార్యను తీసుకుని మోటార్ బైక్ పై వెళ్తున్న సంజిత్ ను కత్తులతో పొడిచి పారిపోయారు. వెంటనే అక్కడివారు సంజిత్ ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. హత్యకు ఉపయోగించిన, రక్తపు మరకలున్న కత్తులను పోలీసులు అఫ్పుడే స్వాధీనం చేసుకున్నారు .
ఈ హత్యలో ఎస్‌డిపిఐ, పిఎఫ్‌ఐ ప్రమేయం ఉందని ఆర్ఎస్ఎస్, బీజేపీలు ముందు నుంచీ ఆరోపిస్తున్నయి. సీబీఐ విచారణ జరిపించాలంటూ పార్టీ బీజేపీ చీఫ్ సురేంద్రన్ ఢిల్లీలో కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేశారు.
గత ఐదేళ్లలో కేరళలో 10మంది ఆర్ఎస్ఎస్ – బీజేపీ కార్యకర్తలను ఇస్లామిస్టులు హత్య చేశారు. రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 50మందికి పైగా స్వయం సేవకులు హత్యకు గురయ్యారు. ప్రధాన దోషులను అరెస్ట్ చేయడంలో జాప్యంపై కేరళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిరసనలు కొనసాగిస్తున్న తరుణంలో కీలక నిందితుడు హరూన్ ను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ కేసులో అరెస్టైన మొత్తం నిందితుల సంఖ్య 10కి చేరింది.

----------=======----------=======---------=

@rashtrapatibhvn
@VPSecretariat
@CMOKerala
@KeralaGovernor
@BJP4Keralam
@Swamy39
@ramindesai
@DevikaRani81
What is going on in Kerala?? https://t.co/t5JpxUFxE0

No comments:

Post a Comment