Sunday, January 2, 2022

ఎవరి కోసం.. ఈ పథకాలు…!

 

ఎవరి కోసం.. ఈ పథకాలు…!

సహజంగా పోలీసుల కోసం పథకాలను జనవరి 26 లేదా ఆగస్టు 15 రోజున ప్రకటిస్తారు. ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కొత్తగా జనవరి 2న పోలీసుల కోసం పథకాలను ప్రవేశ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పోలీస్ శాఖ కోసం కొత్త జీఓ 1 ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇది పోలీసులను ఎంకరేజ్ చేయడానికా..? లేక ఇంకేదైనా రాజకీయ ప్రయోజనాలకా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒక్కప్పుడు పోలీస్ శాఖ కోసం కేంద్ర ప్రభుత్వం.. నేషనల్ వైడ్ గా ఉండే పథకాలు ప్రవేశ పెట్టేది. అది చూసి గొప్పగా ఫీల్ అయ్యేవారు పోలీసులు. అవి సాహసానికి సింబల్ గా ఉండేది. మెడల్ రావాలని దేశ స్పూర్తితో ప్రతీ ఒక్కరు పని చేసేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 600 మందికిపైగా పోలీసులకు కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. ఇది ఎవరి కోసం..? ఎందుకోసం..? అనేది పోలీసులకు సైతం అర్ధం కావట్లేదు. ఇది డీజీపీ మహేందర్ రెడ్డి నిర్ణయమో.. లేక సీఎం కేసీఆర్ ఆదేశమో.. తెల్వదు కానీ..దీనిపై పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.

ఈ కొత్త జీవో ప్రకారం… ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్స్ కి ర్యాంకులు ఇచ్చారు. 500 లకు పైగా ఎఫ్ఐఆర్ లు చేసిన స్టేషన్స్, 200 నుంచి 300 వరకు ఎఫ్ఐఆర్ లు చేసిన స్టేషన్స్, 200 కంటే తక్కువ ఎఫ్ఐఆర్ లు చేసిన స్టేషన్స్ అని చెప్పి… ఇయర్ ఎండ్ పేరుతో ప్రైజ్ లు కూడా ప్రకటించింది ప్రభుత్వం. ఇవ్వన్నీ రాజకీయాలు లేకుండా ఉంటే మంచిదే కానీ.. కొన్ని చెప్పలేకుండా పెదవి కూడా విరుస్తున్నాయి. ఒక్క చెరువులకు మిషన్ కాకతీయ తప్ప.. తెలంగాణలో అన్ని రంగాలకు ఇవ్వాల్సినవి ఎక్కడా ఇవ్వడం లేదు.

ఇక ప్రభుత్వం ఇయర్ ఎండ్ పేరుతో ప్రెస్ మీట్ పెడుతోంది. అవినీతిలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రజల్లో అవగాహన కోసం ప్రెస్ మీట్ లు పెడతారు. కానీ… అందులో మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. పోలీస్ శాఖ కోసం చేసే ఖర్చు గురించి కథనాలు రాస్తే… వామ్మో… ఈ మీడియా మాతో ఇలా కూడా అడుకుంటుందా అంటారు. కానీ.. పోలీసులకు అనుకూలంగా మీడియాలో ఇచ్చే కథనాలను గుర్తించి ఒక్క ప్రైజ్ ఇవ్వరు.. ఒక్కరిని గుర్తించరు.. కానీ… వాళ్ళ స్వార్థం కోసం.. వాళ్లకు అనుకూలంగా ఉండే రిపోర్టర్స్ పై ప్రేమ ఉందని.. గుసగుస ముచ్చట్లు పెట్టడానికే ఇయర్ ఎండ్ సమావేశాలు అని అనిపిస్తున్నాయి. ఇకనైనా కళ్ళు తెరిచి ఎం జరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వం చేతిలో బంగపడ్డ వాళ్ళు.

No comments:

Post a Comment