Wednesday, January 5, 2022

జేపి నడ్డా... అబద్దాలా.... అడ్డా... కేరాఫ్.... ఎర్రగడ్డ KTR.....

*జేపి నడ్డా... అబద్దాలా.... అడ్డా కేరాఫ్.... ఎర్రగడ్డ*

       *KTR.....*

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌పై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కేసీఆర్‌ పట్ల నడ్డా వ్యాఖ్యలు హేయంగా ఉన్నాయన్నారు. ''జేపీ నడ్డా అంటే కేంద్రంలో మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అని ఇప్పటి వరకు కొంత గౌరవం ఉండేది. కానీ, నిన్న ఆయన మాటలు విన్న తర్వాత ఉన్న గౌరవం కూడా పోయింది. బండి సంజయ్‌కు జేపీ నడ్డాకు తేడా లేదు. భాజపా అంటే భారతీయ జనతాపార్టీ కాదు.. బక్వాస్‌ జుమ్లా పార్టీ. ఏడున్నరేళ్లలో దేశానికి భాజపా చేసింది శూన్యం. వ్యవస్థను, మీడియాను గుప్పిట్లో పెట్టుకుని... మీడియాను మోడియాగా మార్చారు. 2022కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు అని నరేంద్రమోదీ 5 జులై 2018న చెప్పారు. ఎన్ని రాష్ట్రాల్లో ఇళ్లు ఇచ్చారు. 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని... 20 జూన్‌ 2018న చెప్పారు. కానీ, రైతుల ఆదాయం ఎక్కడ రెట్టింపు చేశారు. ఆయన పేరు నరేంద్రమోదీ కాదు.. రైతు విరోధి. పంజాబ్‌లో రైతుల నిరసనకు దిగడంతో 30 నిమిషాల పాటు రోడ్డుపైనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చరిత్రలో ప్రధానిని 30 నిమిషాల పాటు రోడ్డుపై నిలబెట్టిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా?. ఇంటింటికీ నీరు, కరెంటు, టాయిలెట్‌ ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా?. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు.
యూపీలో గతంలో గూండాగిరి ఉండేదని... ఇప్పుడు గూండాగిరి లేదని ఓటేయాలని కోరుతున్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడుగుతారు. కానీ, భాజపా నేతలు మాత్రం సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు.. భాజపా, ఈడీ, ఎన్‌ఐఏ, సీబీఐ. జేపీ నడ్డా.. పెద్ద అబద్ధాల అడ్డా... నీ కేరాఫ్‌ అడ్రస్‌ ఎర్రగడ్డ. కేసీఆర్‌ అన్నదాతలకు తోడుండే ఏటీఎం. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ కాదు... సబ్‌కా సాత్‌ సబ్‌కా వినాశ్ అనేలా భాజపా వ్యవహరిస్తోంది. భాజపా ప్రభుత్వం వచ్చాక సామాన్యుడికి ఏం మేలు జరిగింది. కామన్‌ మేన్‌కు శోకం.. కార్పొరేట్లకు కనకవర్షం. రైతు బంధు కాపీ కొట్టి కిసాన్‌ సమ్మాన్‌ నిధి తీసుకొచ్చారు. కిసాన్‌ సమ్మాన్‌ పథకానికి స్ఫూర్తి ఎవరు?. హర్‌ ఘర్‌ జల్‌ స్ఫూర్తి మిషన్‌ భగీరథ కాదా? మా ప్రభుత్వ విధానాలు.. మీ పార్టీ ఎన్నికల నినాదాలు. వడ్ల నుంచి కంటోన్మెంట్‌లో రోడ్ల వరకు కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది. కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్రమే పార్లమెంట్‌లో చెప్పింది. కాళేశ్వరం విషయంలో మీకు మెంటల్‌ బ్యాలెన్స్‌ తప్పిందా? మీ కేంద్ర మంత్రికి తప్పిందా? మీరే తేల్చుకోవాలి. నీతి ఆయోగ్‌కు ఉన్న నీతి కూడా నడ్డాకు లేదు. ప్రజాస్వామ్యం గురించి భాజపా నేతలు మాట్లాడుతుంటే... దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. దిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే.. రోడ్డుపై మేకులు కొట్టించిన భాజపా నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రైతుల రక్తం కళ్లజూసిన ప్రభుత్వం మీది'' అని కేటీఆర్‌ విమర్శించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment