Wednesday, January 19, 2022

పాలక్‌తో చలి పరార్‌!

పాలక్‌తో చలి పరార్‌!

ఈ సీజన్‌లో భోజనంలో పాలకూరను భాగం చేసుకుంటే, చలిని తరిమి కొట్టవచ్చని ఆహార నిపుణులు హామీ ఇస్తున్నారు. పాలక్‌ పనీర్‌, పాలక్‌ పరాటాలతో చలి పులిపై పోరాటం ఎంతో సులువని హితబోధ చేస్తున్నారు. అన్ని కాలాల్లో లభించే పాలకూరతో ఆరోగ్య ప్రయోజనాలు అపారం. మన శరీరానికి అవసరమైన పీచుపదార్థాలనూ అందిస్తుంది పాలకూర.

పాలకూర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి మంచిది. పార్శపు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. చర్మపు నిగారింపు పెరుగుతుందనీ, మెరుగైన దృష్టి సమకూరుతుందని అంటారు. పాలకూరలో కె, సి, డి విటమిన్లు, తేలిగ్గా జీర్ణమయ్యే పీచుపదార్థాలు, ఐరన్‌, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, క్వెర్సెటిన్‌, కేంప్‌ఫెరాల్‌ లాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందులోనూ ల్యూటీన్‌.. వృద్ధాప్యంలో కండ్లు మసకబారకుండా రక్షిస్తుంది. చలికాలంలో దాహం అంతగా వేయదు. కాబట్టి, నీళ్లు తక్కువగా తాగుతారు. దాంతో మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. దీనినుంచి విముక్తి పొందడానికి ఆకుపచ్చటి ఆకుకూరలు ఎంతో దోహదపడతాయి. అంతేకాకుండా, ఆకుకూరలు విటమిన్లు, ఐరన్‌, ఫోలిక్‌ ఆమ్లం, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం మొదలైనవాటిని కలిగి ఉంటాయి. ఇవన్నీ వివిధ ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుతాయి. అంతేకాదు ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఫలితంగా బరువు పెరగడం, మలబద్ధకం, ఎముకల ఆరోగ్యం, మధుమేహం, గుండె కవాటాలకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

No comments:

Post a Comment