*Bplkm విశ్లేషణ* 14/12/2021
----------------------------------------
తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు @TelanganaCMO కేసీఆర్ సారు గారికి నమస్కారం 🙏.
సారు గారు ఈరోజు MLC ఫలితాలు మీ ప్రతిష్ణకు భంగం కలిగేలా వున్నాయి. ఎందుకంటే ఫోటోను చూసో లేకపోతే మీ ప్రభుత్వ పనితీరు చూసో ఈ ఫలితాలు రాలేదు.....ముఖ్యంగా తెలంగాణ సాధన కోసం నిస్వార్థంగా పోరాటం చేసి అమరులైన అమరవీరుల కుటుంబ సభ్యులకు MLC టికెట్ ఎందుకు ఇవ్వలేదు?? ఉద్యమకారులకు ఎందుకు ఇవ్వలేదు??.
ఓటరు మహాశయులను ఎత్తుకెళ్లి రిసార్ట్ లలో దావత్ లు ఇచ్చి కాదు కాదు మేపి అంటే బాగుంటుంది. ఇలా ప్రజాస్వామ్యంను అగౌరవపరిచి మీ అభ్యర్థులు అడ్డదారిలో గెలువడం చూస్తుంటే నైతికంగా మీ మీద అసహనం వున్నట్లే అని మీకే అర్థం అయివుంటుంది.
సోషల్ మీడియా లేకపోతే వాస్తవాలు బయటకు వచ్చేవా?? తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఏది నిజం ఏది అబద్దం తెలుసుకుంటున్నారు.
ముఖ్యంగా మీ భజన బ్యాచ్ కు ప్రజా సంకల్పం & link Media ద్వారా తెలియచేస్తున్నాము వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఏ ఏ రిసార్ట్ లకు తీసుకుపోవాలో ఇప్పటినుంచే ఆలోచించమని చెప్పండి.బుర్జు ఖలీఫా అయితే బాగుంటుంది. అందులో సగం మీ నాయకులవే కదా!!.ఎందుకంటే రిసార్ట్ లు ముందే బుక్ చేసుకోకపోతే మీకే నష్టం.
ధన్యవాదములు 🙏
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment