Tuesday, December 7, 2021

యూనివర్సిటీనా …? వ్యాపార కేంద్రమా ..? కదంతొక్కిన ఏబీవీపీ

యూనివర్సిటీనా …? వ్యాపార కేంద్రమా ..? కదంతొక్కిన ఏబీవీపీ

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్సిటీలోని సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా చేసిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కోర్సుల్లో ఫీజులు పెంచుతున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ విద్యార్థులు నిరసనకు దిగారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్ లు భర్తీ చేయాలని.. హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీసీ బిల్డింగ్ ముట్టడి చేశారు.


ఉచితంగా విద్యనందిచాల్సిన ప్రభుత్వ యూనివర్సిటీలు సైతం విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నాయని మండిపడ్డారు. కొత్తగా వీసీ నియామకం అయిన ప్రతిసారీ.. యూనివర్సిటీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని.. కానీ, అందరి తీరు ఒకేలా ఉంటుందని విమర్శించారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారటంతో సమాచారం అందుకున్న పోలీసులు.. నిరసనకారులను అరెస్ట్ చేసి అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించాలి.

అయితే, సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని ఏబీవీపీ నేతలు హెచ్చరించారు.

No comments:

Post a Comment