Thursday, December 9, 2021

తొలివెలుగు చెప్పిందే నిజమైంది.. జూబ్లీహిల్స్ సొసైటీకి చుక్కెదురు

తొలివెలుగు చెప్పిందే నిజమైంది.. జూబ్లీహిల్స్ సొసైటీకి చుక్కెదురు

– సంప‌న్నుల జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో…

– మీడియా సంస్థ‌ల‌ అధిప‌త్యానికి బ‌ల‌యిన సెక్రెట‌రీ
– మంచి పేరున్న‌ ముకుంద్ ని తీసుకొచ్చి కేసులు పెట్టించిన వైనం
– సొసైటీలో అక్ర‌మాలను వెలుగులోకి తెచ్చిన తొలివెలుగు
– ట్రైబ్యునల్ తీర్పుతో మ‌ళ్లీ ఎల‌క్ష‌న్స్ వ‌ర‌కు సెక్రెట‌రీగా ముకుంద్

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్ర‌మాలు జ‌రిగాయని తొలివెలుగు చెప్పిందే నిజమైంది. అత్యంత‌ సంప‌న్నులు ఉండే ప్రాంతంలో ఆధిప‌త్యం కోసం రెండు ఛానల్స్ ఓన‌ర్స్ పాకులాడుతున్నార‌ని జ‌రుగుతున్న తీరును తొలివెలుగు ఎండ‌గట్టింది. అక్ర‌మాలపై క‌క్ష సాధించుకునేలా ఒక‌రిపై ఒకరు క‌త్తులు నూరుకున్న వైనాన్ని సవివరంగా కథనాలను ఇచ్చింది. సరిగ్గా అప్పుడే స‌భ్యుల మంచి కోసం వారి ఇంటి స్థ‌లం లేదా ప్లాట్స్ కోసం పాటుప‌డుదామ‌న్న సెక్రెట‌రీ ముర‌ళీ ముకుంద్ ని.. రెంటికి చెడ్డ రేవ‌డిలా త‌యారు చేశారు. ప్ర‌స్తుత క‌మిటీలో గెలిచిన ఆయన… పాత క‌మిటీకి స‌పోర్ట్ చేస్తున్నార‌ని తొటి వారే ఎదురు తిరిగారు. “అక్ర‌మాలపై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంది. కో-ఆప‌రేటివ్ రిజిస్ట్రార్ సోసైటీ చర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేద్దామ‌ని క‌మిటీలో ప్ర‌పోజ‌ల్ పెట్టారు. మేము గెలిచిందే.. పాత క‌మిటీ వారు చేసిన అక్ర‌మాల‌ను బయ‌ట‌పెట్టేందు” అంటూ ఆయన ఎదురుతిరిగారు. ఒక్క క‌మిటీ వారికే కాకుండా 50శాతం మంది స‌భ్యుల‌కు న‌ష్టం వాటిళ్లనుంది కాబ‌ట్టి.. అది క‌మిటీ చేయ‌కుండా మ‌రో ద‌ర్యాప్తు సంస్థ‌కు అప్ప‌గించాల‌ని చెప్పారు. దీంతో మొద‌టి నుంచి వ్య‌తిరేకంగా ఉన్న న‌రేంద్ర చౌద‌రీ టీంకి చెడింది. ప్ర‌స్తుతం అధ్య‌క్షునిగా ఉన్న బి.ర‌వీంద్రనాథ్ చౌద‌రి త‌మ ప‌నుల‌కు అడ్డంకిగా మారాడ‌ని శ‌తృత్వం పెంచుకున్నారు. ఫైల్స్ మిస్ చేశార‌ని పోలీస్ స్టేష‌న్ లో అక్ర‌మంగా కేసులు బ‌నాయించార‌ని చీటింగ్ కేసులు న‌మోదు చేశార‌ని ముర‌ళీ వాపోయాడు. ఓ ప్ర‌ముఖ స్కూల్ లో సెక్రెట‌రీగా ప‌నిచేస్తున్నారు. అక్క‌డ ఎలాంటి అక్ర‌మాల‌కు, అవినీతికి తావులేకుండా సిస్ట‌మ్ ని ఏర్పాటు చేశారు. ఆ మంచిపేరుని ఎల‌క్ష‌న్స్ కోసం వాడుకునేందుకు మురళిని బాడీలోకి తీసుకొని ఆ త‌ర్వాత ఇబ్బందులు పెట్టార‌ని జూబ్లీక్ల‌బ్ లో టాక్. మొద‌ట ఖాళీ స్థ‌లాలు ఏం చేయాలి.. ఎలా సభ్యుల‌కు న్యాయం చేద్దామ‌నే తన ఉద్దేశమే కోర్టుల చుట్టు తిప్పింద‌ని అంటున్నారు మురళి ముకుంద్.

థ్రిల్ల‌ర్ సినిమాని త‌ల‌పించేలా కేసులు

సొసైటీ లో అత్య‌ధిక కాలం చ‌క్రం తిప్పిన ఎన్టీవీ ఓన‌ర్ న‌రేంద్ర‌ చౌద‌రి.. ఎల‌క్ష‌న్స్ జ‌ర‌పాల‌ని హైకోర్టులో కేసు వేశారు. ఓట‌ర్ లిస్ట్ అప్ డేట్ తో పాటు.. ఎన్నిక‌ల‌కు అదేశించింది ఉన్న‌త న్యాయ‌స్థానం. అయితే న‌రేంద్ర‌ చౌద‌రి మ‌ద్ద‌తు ఇచ్చిన టీం పై టీవీ5 య‌జ‌మాన్యం పోటీచేసి గెలిచింది. ఈ క్రమంలో గ‌త క‌మిటీ త‌ప్పిదాలు ఒక్కొక్క‌టి బయ‌ట‌కు వ‌చ్చాయి. తొలివెలుగు మొద‌ట‌గా ఈ అక్ర‌మాలపై ఫోకస్ చేసింది. గ్రీన్ కో కంపెనీకి ఆర్టీసీ డిపో కోసం అనుకున్న భూమిని ఎలా నిర్మించి అతి త‌క్కువ లీజుకు క‌ట్ట‌బెట్టారో గ్రీన్ కో ఎలుకో అని రాసింది. క‌బ్ల్ ఎన్నిక‌ల తీరును ఎండ‌క‌ట్టింది. ఆ త‌ర్వాత అధిప‌త్యం పోరు బాగా పెరిగింది. పాత లెక్క‌లు అన్ని ఫోరెన్సిక్ ఆడిటింగ్ జ‌ర‌గాల‌ని ప్ర‌స్తుత క‌మిటీ చ‌ర్చించింది. ఫోరెన్సిక్ అడిటింగ్ తో ఓరిగేది ఎమి లేదు. గ‌తంలో విజిలెన్స్, ఏసిబి, సిఐడీ ద‌ర్యాప్తులు చేశాయి. ప్ర‌భుత్వమే నిగ్గుతేల్చాల‌ని కోరారు ముర‌ళీ. దీంతో కొన్ని పాత ఫైల్స్ మిస్ చేశార‌ని అధ్య‌క్షుల అదేశాల‌తో జూబ్లీహిల్స్ లో కేసు న‌మోదు చేశారు. తాను సంర‌క్షకున్నే త‌ప్పా ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని అన్నారు. సెక్రెట‌రీ పోస్ట్ నుంచి తనను తీసివేయాల‌ని ప్లాన్ చేస్తుండ‌గా కోఆప‌రేటివ్  ట్రైబ్యునల్ కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. పాల‌క‌మండ‌లి హైకోర్టుకు వెళ్లి స్టే వెకెట్ చేపించారు. ఆ త‌ర్వాత సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పుతో డివిజ‌న్ బెంచ్ కు వెళ్లారు ముర‌ళీ ముకుంద్. తీర్పుకు కొద్ది గంట‌ల ముందే పాల‌క‌మండ‌లి ప్ర‌త్యేక పాల‌న అధికారి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. కో ఆప‌రేటివ్ ట్రైబ్యునల్  2 వారాల్లో విచార‌ణ జ‌రిపి తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని అదేశించింది. దీంతో గురువారం ట్రైబ్యునల్ ముర‌ళీ ముకుంద్ ని సెక్రెట‌రీగా కొన‌సాగించాల‌ని ఉత్త‌ర్వులు ఇచ్చింది.

ఇప్ప‌టికైనా పోరు అగేనా..?

మీడియా సంస్థ‌ల య‌జ‌మాన్యాల అధిప‌త్యం పోరు సోసైటీ స‌భ్యుల‌కు న‌ష్టం వాటిళ్లేలా ఉంద‌ని చాలా మంది ఆరోప‌ణ‌. అక్ర‌మాలపై నిగ్గుతేల్చాలంటే.. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు సంస్థకు రిఫ‌ర్ చేసేలా ఒత్తిడి తీసుకురావాలి. కానీ సొంత ప్ర‌యోజ‌నాల కోస‌మే అటు పాత క‌మిటీ, ఇటు కొత్త క‌మిటీ నాట‌కీయ ప‌రిణామాలు చేస్తున్నాయని వినికిడి. ఇప్పటికైనా ఇంకా ఎంత భూమి ఖాళీగా ఉంది… సొంత స్వార్ధం కోసం కాకుండా స‌భ్యుల‌కు సొంతింటి క‌ల నేర‌వేరేలా ప‌నులు చేయాల‌ని తొలివెలుగు కోరుకుంటోంది. బ‌డాబాబులు, వీవీఐపీలు ఉన్న‌ సొసైటీ అంద‌రికి అద‌ర్శంగా ఉండాలి కానీ ఆధిప‌త్యం పోరులో న‌వ్వుల పాలు కావ‌ద్ద‌ని సూచిస్తోంది.


No comments:

Post a Comment