వ్యాక్సినేషన్ లో తెలంగాణ రికార్డ్
వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ మైలురాయిని చేరుకుంది. మొదటి డోసు వ్యాక్సినేషన్ 100శాతం పూర్తైంది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ కేక్ కట్ చేశారు. కరోనా మొదటి డోసు వ్యాక్సిన్ 100శాతం పూర్తి చేసిన పెద్ద రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు.
త్వరలో రెండో డోసు వ్యాక్సినేషన్ లో కూడా 100 శాతం మార్కును చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండో డోసు ఇప్పటికే 66 శాతం పూర్తయిందని హరీష్ తెలిపారు. ఆరోగ్యశాఖ కార్యకర్తల పనితీరు కారణంగానే ఈ ఘనత తెలంగాణ సొంతం అయిందని చెప్పారు. జనవరి 3 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని.. జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
No comments:
Post a Comment