సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సనాతన భారత ఔన్నత్యం ప్రపంచానికి తెలుస్తోంది
” సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సనాతన ధర్మం ఉనికి మరియు దాని గొప్పతనం ప్రపంచం గుర్తిస్తుంది ”
నందిత కృష్ణ చరిత్రకారిణి మరియు పర్యావరణవేత్త, మరియు చెన్నైలోని CPR ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండోలాజికల్ రీసెర్చ్ డైరెక్టర్. ఆమె “చెన్నై థెన్ మద్రాస్ నౌ (2014)కి ” సహ-రచన చేసింది.
ఇటీవల హాంకాంగ్‌లోని ఆర్ట్ డీలర్ అయిన జెరెమీ పైన్ నుండి ఆమెకు ఒక ఇమెయిల్ వచ్చింది. తాను 9 సెంటి మీటర్లు వెడల్పు గల టెర్రకోటను (ఎర్ర రంగు మట్టితో చేసి కాల్చి తయారు చేయబడ్డ పలక) పలకను నేపాల్ లో చాలా కాలం క్రిందట కొనుగోలు చేసానని చెప్పాడు.
ఆ టెర్రకోట ఫలకం పై “స్పోక్ వీల్‌తో రథం, నాలుగు గుర్రాలను పట్టుకున్న ఒక రథసారథి, వెనుక సగంలో ఒకరు నిలబడి, రెండు అమ్ములపొదులు ఉన్న దృశ్యం ఉంది”. ఫలకం వెనుక భాగం లో రెండు రంధ్రాలలో, మధ్య ఉన్న కేంద్ర రంధ్రం అసలైనది, పక్కన ఉన్నది పరీక్ష కోసం నమూనా తీసుకోబడింది, బహుశా ఈ ఫలకం వేలాడదీయడానికి మధ్య కన్నం ఉపయోగించబడి ఉండవచ్చు.
“Oxford Authentication” థర్మోల్యూమినిసెన్స్ (TL) డేటింగ్ పద్ధతిని ఉపయోగించి కాలాన్ని ధృవీకరిస్తూ సర్టిఫికెట్ మే 14, 2019న ఇచ్చింది. ఈ ధృవీకరణ ఫలితం ప్రకారం ఈ పలక కాల్చిన కాలం 2,300 మరియు 3,600 సంవత్సరాల క్రితంది గా ధృవీకరించబడింది, అంటే 1,600 BCE నుండి 300 BCE. ఈ తేదీ సింధు లోయ నాగరికత ముగింపు (1,500 BCE) మరియు చారిత్రాత్మక కాలం (600 BCE)కి అనుగుణంగా ఉంటుంది, ఈ కాలాన్ని పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్ అని పిలుస్తారు, ఇది హస్తినాపురంలోని స్థావరాలతో మరియు మహాభారతంలో పేర్కొన్న గ్రామాలతో ముడిపడి ఉంది – ఇంద్రప్రస్థ (ఢిల్లీ), పాన్‌ప్రస్థ (పానిపట్), సోన్‌ప్రస్థ (సోనిపట్), తిల్‌ప్రస్థ (తిల్పట్) మరియు వ్యాగ్ప్రస్థ (బాగ్‌పట్).
ఈ TL ధ్రువీకరణ ఫలితం ప్రకారం మహాభారతం చాలా పాతది. ఆ కథ చెప్పే అవసరాల కోసమో లేదా అలంకరణ కోసమో బహుశా ఈ టాబ్లెట్‌ని తయారుచేసి ఉండవచ్చు.
ఈ TL డేటింగ్ అనేది స్ఫటికాకార ఖనిజాలను కలిగి ఉన్న పదార్థం వేడి చేయబడి (లావా, సెరామిక్స్) లేదా సూర్యరశ్మి తగలడం వల్ల (అవక్షేపాలు) గడిచిన కాలం యొక్క పేరుకుపోయిన రేడియేషన్ మోతాదును కొలవడానికి ఉపయోగించబడుతుంది. పురాతన కుండల యొక్క చిన్న నమూనాను వేడి చేసినప్పుడు మందమైన నీలిరంగు కాంతి ప్రకాశిస్తుంది. దాని జీవితకాలంలో, కుండ ముక్కలు పర్యావరణం నుండి రేడియేషన్‌ను గ్రహిస్తాయి, థర్మోలుమినిసెన్స్‌ను సృష్టిస్తాయి. పాత కుండ ముక్కలు, ఎక్కువ రేడియేషన్ గ్రహిస్తాయి అందువల్ల కుండ ముక్కల నమూనా లేదా శాంపిల్ ప్రకాశవంతంగా మెరుస్తుంది. TL ద్వారా కొలవడం ద్వారా ఆ కుండ ముక్క ఎంత రేడియేషన్ గ్రహించబడిందో లెక్కించవచ్చు మరియు కుండల యొక్క సుమారు వయస్సును కూడా లెక్కించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
ఈ టెర్రకోట ఫలకం కృష్ణుడు మరియు అర్జునుడి దృశ్యం అయి ఉంటుంది. ఇతిహాసం అనేక మంది వ్యక్తులు నాలుగు గుర్రాలు ఉపయోగించడం గురించి చెప్పినా, అర్జునుడు ప్రత్యేకంగా సైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప మరియు బలాహక అనే నాలుగు గుర్రాల రథంతో ప్రత్యేకంగా గుర్తించబడ్డాడు.
అయితే ఈ టాబ్లెట్‌లో ఎవరు అర్జునుడు మరియు ఎవరు కృష్ణుడిని గుర్తించడం సమస్య. ముందుకు చాచిన చేయి సాధారణంగా అర్జునుడితో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే అతను కౌరవులవైపు చూపుతూ వారితో పోరాడటానికి నిరాకరిస్తాడు. కానీ ఆ తర్వాత అర్జునుడికి కృష్ణుడి భగవద్గీత ఉపదేశం చేయబడ్డాక యుద్ధం జరుగుతుంది. అయితే కృష్ణుడు యుద్ధం చేయకూడదని నిర్ణయించినపుడు రెండు బాణాల అమ్ములపొదులు ఎందుకు ఉన్నాయి? ప్రపంచంలోని గొప్ప విలుకాడు అయిన అర్జునుడికి ఒక రోజు యుద్ధానికి ఆతనికి ఒకటి కంటే ఎక్కువ అమ్ములపొదులు అవసరం కావచ్చు. లేదా అర్జునుడు యుద్ధంలో చంపబడితే ఏమి చేస్తారని కృష్ణుడిని అడిగినప్పుడు, కృష్ణుడు నేను నా ఆయుధాలను తీసుకొని కర్ణుడిని మరియు శల్యుడిని చంపుతాను” అంటాడు. కాబట్టి, బహుశా, కృష్ణుడు కూడా తన ఆయుధాలను కలిగి ఉండవచ్చు. అందుకే రెండు అమ్ములపొదులు.
కృష్ణుని భగవద్గీతకు దారితీసిన గీతోపదేశం సన్నివేశం యొక్క ముందు సంఘటనా చిత్రంగా దీనిని పేర్కొనవచ్చు. ఈ రెండు బొమ్మలు హరప్పా తరహా హెడ్‌బ్యాండ్‌లు ధరించి ఉన్నాయి. ఈ టెర్రకోట టాబ్లెట్ కనుగొనబడడం చాలా ఉత్తేజకరమైన ఆవిష్కరణ అని క్రిస్టోఫర్ పైన్ అనే బ్రిటిష్ పురాతన శాత్రవేత్త చెప్పారు. ఈ టాబ్లెట్ భగవద్గీత మరియు మహాభారతాలను ప్రస్తుతం సాధారణంగా అనుకుంటున్న కాలం కంటే చాలా పూర్వ కాలానికి తీసుకువెళుతుంది.
ఆసక్తికరంగా, BR చోప్రా యొక్క TV ధారావాహిక మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో ఒకే రకమైన అర్ధ-రథాన్ని వర్ణిస్తుంది. ఢిల్లీలోని ASI ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ మంజుల్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం తవ్విన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని సనౌలీ నుండి వచ్చిన సగం రథాన్ని పోలి ఉంటుంది. అది కూడా 2,000 BCE-1,800 BCE నాటిదని చెప్పబడింది, అయితే ఇంకా కార్బన్ డేటింగ్ ఫలితాలు ప్రచురించబడిన తర్వాత మాత్రమే దాని తుది తేదీ అందుబాటులో ఉంటుంది. పాండవులు కోరిన ఐదు గ్రామాలలో బాగ్‌పత్ ఒకటి. అయితే, సనౌలీ చక్రం పటిష్టంగా అంటే సాలిడ్ గా ఉండగా, నేపాల్ చక్రం స్పోక్ చేయబడి ఉంది.
ఈ స్పోక్డ్ వీల్ గురించి ఋగ్వేదంలో వివరించబడింది. డాక్టర్ BB లాల్ రాఖీగర్హి నుండి టెర్రకోటలో చిత్రీకరించబడిన చువ్వలతో ఉన్న ఒక చక్రాన్ని గుర్తించారు, అయితే డాక్టర్ SR రావు లోథాల్ నుండి చువ్వలు ఉన్న చక్రం యొక్క చిత్రణను కూడా చూపించారు. అంటే ఇది అప్పటికే హరప్పా సంస్కృతిలో ఉందని అర్థం. ఈ కొత్త టాబ్లెట్ వల్ల ఒక ప్రశ్న ఉదయిస్తుంది-స్పోక్ వీల్ హరప్పా కాలం దా లేదా వైదిక కాలం దా లేదా రెండు కాలాల్లో ఉండేదా?
మరో విచిత్రం చూడండి. పాకిస్తాన్‌లోని లర్కానా జిల్లా, మొహెంజోదారో నుండి త్రవ్విన సోప్‌స్టోన్‌లో, రెండు చేతులకు కంకణాలు ధరించిన ఒక బాలుడు రెండు చెట్లను పెకిలించివేస్తున్నట్లు, దాని నుండి రెండు మానవ బొమ్మలు బయటపడుతున్నట్లు ఉంటుంది. కృష్ణుడు మాత్రమే అలా చెట్లను కూల్చగా నలకుబేరుడు, మణిగ్రీవుడు అనే శాపగ్రస్త గంధర్వులు ఉద్భవించినట్లు మన ఇతిహాసాలలో ఉంది. భాగవత పురాణంలోని అనేక ప్రసిద్ధ కథలలో ఇది ఒకటి.
నేపాల్ నుండి వచ్చిన టెర్రకోట టాబ్లెట్ మహాభారత రహస్యానికి మరో కోణాన్ని జోడిస్తుంది అనడంలో సందేహం లేదు.
No comments:
Post a Comment