జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్‌కు 147 ఏండ్లు
- శిథిలమవుతున్న చరిత్ర ఆనవాళ్లు
- పునరుద్ధరించాలని వేడుకోలు
సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వారస్వత సంపదను కాపాడాలి. పదిలంగా భవితరాలకు అందించాలి.. అంటూ వారసత్వ ప్రియులు కోరుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న నగరంలో చారిత్రాత్మక కట్టడాలు కనుమరుగైపోతున్నాయి. తాజాగా సికింద్రాబాద్లోని జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ఎంతో చారిత్రాత్మకమైంది. శిథిలమవుతున్న ఈ రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నదని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ అధికారులకు ట్వీట్ చేశారు. 1874లో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ స్వయంగా నిధులు కేటాయించి సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రైలు మార్గాన్ని నిర్మించాడు. అప్పుడు ఈ స్టేషన్ ఇంటర్మీయట్ స్టేషన్గా ఉండేది.
దాదాపు 147 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్‌లో ఇప్పటికీ అప్పటి కట్టడాల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా పాత ప్రవేశ ద్వారం ఒకటి. దాన్ని ఆధునీకరించి కాఫీ షాపుగా చేయాలని వారసత్వ ప్రియులు కోరుతున్నారు. అప్పటి టికెట్ బుకింగ్ కౌంటర్ సగం శిథిలమై ఇప్పటికీ కనిపిస్తుంది. 1951లో నిజాం స్టేట్ గ్యారెంటీడ్ రైల్వే (ఎన్‌ఎస్‌జీఆర్)ను సెంట్రల్ రైల్వేలో విలీనం చేశారు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర ఉన్న జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించాలి.. భావితరాలకు పదిలంగా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.. అని హైదరాబాద్ హెరిటేజ్ ప్రియులు కోరుతున్నారు.
No comments:
Post a Comment