నేను అలా అనలేదు .. సాగు చట్టాలకు సంబంధించిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Narendra Singh Tomar
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar) తాజాగా చేసిన వ్యాఖ్యలు.. కేంద్రం మళ్లీ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురానుందా అనే చర్చకు దారితీసింది. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు.
సాగు చట్టాలకు (farm laws) వ్యతిరేకంగా రైతులు ఏడాది పాటు పోరాటం కొనసాగించడంతో.. కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar) తాజాగా చేసిన వ్యాఖ్యలు.. కేంద్రం మళ్లీ వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురానుందా అనే చర్చకు దారితీసింది. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ‘మేము వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చాం. కానీ కొంతమందికి అవి నచ్చలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ (Narendra Modi) నాయకత్వంలో పెద్ద సంస్కరణ తీసుకొచ్చాం. అయితే ప్రభుత్వం నిరాశ చెందలేదు. మేము ఒక అడుగు వెనక్కి వేశాం. మేము మళ్ళీ ముందుకు సాగుతాము.. ఎందుకంటే రైతులు భారతదేశానికి వెన్నెముక. ఆ వెన్నెముక బలోపేతం అయితే.. దేశం మరింత బలపడుతుంది’ అని అన్నారు.
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసిందని.. తర్వాత మళ్లీ తీసుకొస్తుందని అనడానికి మంత్రి వ్యాఖ్యలే నిదర్శమని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యలు ప్రధాని మోదీ క్షమాపణలను అవమానించడమేనని అన్నారు. ఇది ఖండించిందగినదని Rahul Gandhi ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మళ్లీ రైతు వ్యతిరేక చర్యలు తీసుకున్నట్టయితే అన్నదాలు మళ్లీ సత్యాగ్రహం ప్రారంభిస్తారని అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భయంతో పార్లమెంట్‌లో ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారని, మూడు ‘నల్ల’ చట్టాలను రద్దు చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలనే కేంద్రం కుట్రను తోమర్ ప్రకటన మరోసారి బట్టబయలు చేసిందని అన్నారు. మూడు నల్ల చట్టాలను తిరిగి కొత్త రూపంలో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు స్పష్టమైందని విమర్శించారు.
Also Read: ఎన్నికల కోసమే సాగు చట్టాలు రద్దు చేశారా ?- ట్విటర్ మంత్రి కేటీఆర్
నేను అలా అనలేదు.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివరణ ఇచ్చారు. farm lawsను సవరించిన రూపంలో కేంద్రం తిరిగి ప్రవేశపెట్టదని తెలిపారు. నాగ్‌పూర్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినప్పుడు.. తాను అలా అనలేదని మంత్రి చెప్పారు. ‘ప్రభుత్వం మంచి(వ్యవసాయ చట్టాలు చేసిందని నేను చెప్పాను. కొన్ని కారణాల వల్ల మేము వాటిని వెనక్కి తీసుకున్నాము. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది’ అని మంత్రి తోమర్ చెప్పారు. ఇక, పార్లమెంట్ ఉభయ సభలు పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో సాగు చట్టాల రద్దు బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment