Wednesday, December 22, 2021

చెరువులను కబ్జా చేస్తుంటే మీరేం చేస్తున్నారు??

*తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారికి నమస్కారం 🙏*

*ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న పెద్ద చెరువుల పరిరక్షణకోసం Dr లుబ్నా సర్వత్ మేడం గారి ఆధ్వర్యంలో ప్రజా సంకల్పం & గంగపుత్ర సంఘము పోరాటం చేస్తుంది. రెండు చెరువుల వాస్తవ వైశాల్యం ఎంత ప్రస్తుతం ఎంత వుంది,ఈ రెండు చెరువులను కబ్జాల నుండి, పర్యావరణ కాలుష్యం నుండి కాపాడడానికి, భూగర్భ జలాలను పెంపొందించడానికి చెరువుల పూడికతీత కోసం తెలంగాణ గౌరవ లోకాయుక్త హైదరాబాద్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ కొనసాగుతుంది.*

*కేటీఆర్ సారు గారు అసలు చెరువులను ఎవరు కబ్జా చేశారు?? చెరువు తూములను ఎవరు ముశారు?? మీరు వరదలు వచ్చినప్పుడు రామంతాపూర్ వచ్చి చెరువులు కబ్జా గురించి అధికారులను నీలాదీశారు & చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు ఇచ్చారు కదా మరి ఈరోజు వరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు ఎందుకు?? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు వుంది. మీరు పురపాలక శాఖ మంత్రివర్యులు కదా.*

*సర్ ఇప్పుడు చెరువు నిండి ఇండ్లలోకి నీరు వస్తుంది అని కొత్తగా పది కోట్లతో మూసీ నది వరకు పైపు లైను వేస్తున్నారు కదా ఈ 10కోట్లు ఎవరివి సర్?? చెరువు కబ్జా చేసి అక్రమనిర్మాణాలు చేసి చెరువు తూములను ముసివేసి తూము నాలాను కబ్జా చేసిన వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా న్యాయంగా పన్నులు కడుతున్న ప్రజల డబ్బును ఇలా అక్రమార్కుల కోసం మీరు వినియోగించడం న్యాయమేనా జవాబు చెప్పండి మంత్రి గారు.*

*చెరువు ఎందుకు నిండింది?? ఇండ్లలోకి నీరు ఎందుకు వస్తుంది??దీనికి కారణం ఎవరు?? ఈరోజు వరకు అధికారులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు??వీటికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది అని ప్రజా సంకల్పం & link Media ద్వారా ప్రశ్నిస్తున్నాము... Bplkm*

*కేటీఆర్ సారు గారు చెరువులను కబ్జాల నుంచి కాపాడాలి అని తెలంగాణ గౌరవ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేయడం చూస్తుంటే న్యాయస్థానాల ఆదేశాలకు ఎలా గౌరవం ఇస్తున్నారో తెలుస్తుంది*

*Copy to Group link Media* &  *All Print & Electronic Media*
22/12/2021

Bapatla Krishnamohan 

prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment