గ్రేటర్‌లో ఫ్రీగా Drinking Water కావాలంటే.. త్వరపడండి.. నాలుగు రోజులే గడువు..
Courtesy by ABN మీడియా ట్విట్టర్
Dec 28 2021 @ 08:24AM

హైదరాబాద్ సిటీ/సైదాబాద్ : గ్రేటర్‌లో అర్హులైన కుటుంబాలు ఉచితంగా 20 వేల లీటర్ల తాగునీటిని పొందాలనుకుంటే ఈ నెల 31లోగా నీటి కనెక్షన్ క్యాన్ నెంబర్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. ఈ పథకం కోసం తొలుత ఈ ఏడాది మార్చి 31, ఏప్రిల్ 30, ఆగస్టు 15 ఇలా.. పలుమార్లు గడువు పెంచింది. అనంతరం ఈ నెలాఖరు వరకు మరో అవకాశం ఇచ్చింది. ఈ పథకంలో చేరనివారికి 2020 డిసెంబర్ నుంచి 13 నెలల బిల్లులు ఒకేసారి జారీ చేయనున్నారు.
అనుసంధానం ఇలా..
నీటి కనెక్షన్ ఉన్నవారు జలమండలి వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. దీంతో పాటు మీటర్ల బిగింపు తప్పనిసరి. మీటర్ ఫొటోతో పాటు క్యాన్ నంబర్, ఆధార్ కార్డును జలమండలి కార్యాలయంలో సంబంధిత అధికారికి అందజేసినా సరిపోతుంది. ఎలాంటి సందేహాలున్నా 155313కు ఫోన్ చేయవచ్చు.
No comments:
Post a Comment