Sunday, December 19, 2021

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సిల్ స్కూల్ లో పార్ట్ టైమ్ టీచర్స్ బాధలు

తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారికి నమస్కారం 🙏.ప్రజా సంకల్పం & link Media ను సంప్రదించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్స్ పార్ట్ టైమ్ టీచర్స్ ప్రతినిధి మామిళ్ల కళ్యాణ్ గౌడ్. సర్ దయచేసి వీరి బాధను అర్థం చేసుకొని న్యాయం చేయగలరు* 

మేము అనగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సిల్ స్కూల్ లో పార్ట్ టైమ్ టీచర్ గా గత 5 సంవత్సరాలనుండి మేము రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పని చేస్తా ఉన్నాం కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు.అదేవిదంగా గత 5 సంవత్సరాలనుండి 14000 శాలరీ తో పని చేస్తునాము. కాని మమ్మల్ని ఒక అటెండర్ శాలరీ కుడా ఇవ్వలేని ఈ తెలంగాణ రాష్ట ప్రభుత్వం. 

ఇదే తెలంగాణ రాష్ట్రము లో మైనారిటీ వెల్ఫేర్ లో 22000 వేల శాలరీ ఇస్తా ఉంటే మాకు మాత్రం 14000 ఇవ్వడమేంటి సార్. ఇదేనా మేము సాధించిన తెలంగాణ. 

సమాన పనికి సమాన వేతనం అమలు  జాబ్ సెక్యూరిటీ కల్పిస్తారని, మా బాధలు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాము.మా జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతోందో  అన్న భయం తో బ్రతుకుతా ఉన్నాము. 
సార్ దయచేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ.

మామిళ్ల కళ్యాణ్ గౌడ్
ఫోన్ : 9000965670
                                                     ఇట్లు
                                              PT Teachers                                                TSWRS Telangana.

prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment