Wednesday, December 15, 2021

ఇంకొన్ని గంట‌ల్లో ఉన్న‌తాధికారుల‌ బ‌దిలీలు.. ఎవ‌రెవ‌రు ఎక్క‌డికంటే..?

ఇంకొన్ని గంట‌ల్లో ఉన్న‌తాధికారుల‌ బ‌దిలీలు.. ఎవ‌రెవ‌రు ఎక్క‌డికంటే..?

– 40 మంది ఐపీఎస్ లు, 20 మంది ఐఏఎస్ లు
– ఇంకొన్ని గంట‌ల్లోనే బ‌దిలీలు
– మార‌నున్న హైద‌రాబాద్, రాచ‌కొండ క‌మిష‌న‌ర్లు
– ఇవి ఎన్నిక‌ల‌కు అనుకూలమైన బ‌దిలీలేనా?
– ఒకేసారి ఇంత మందికి స్థాన‌చ‌ల‌నం దేనికి?

తెలంగాణ‌లో ఉన్న‌తాధికారుల బ‌దిలీలు జ‌రిగి ఎన్నో ఏళ్ల‌యింది. ప‌దోన్న‌తులు వ‌చ్చినా.. రెండేళ్ల‌కు పైగా అదే ఉద్యోగం చేస్తున్న ఐపీఎస్ లు ఉన్నారు. కొత్తవారికి అవ‌కాశం ఇవ్వ‌కుండా కొంతమంది అధికారులకు ఇంచార్జీల పేరుతో మూడు నుంచి ఐదు శాఖ‌లు అప్ప‌గించింది ప్ర‌భుత్వం. కొంద‌రికేమో అస‌లు ప‌నే ఉండ‌దు.. మ‌రికొంద‌రికైతే కాస్త కూడా గ్యాప్ లేకుండా ప‌నిభారం. రాష్ట్రంలో చాలా శాఖ‌ల్లో ఇదే ప‌రిస్థితి. అయితే.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్ ల బ‌దిలీలు ఇంకొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌బోతున్న‌ట్లు వినికిడి. వ‌చ్చే ఏడాదిలోనే ఎల‌క్ష‌న్ కు వెళ్లాల‌ని భావిస్తోంది ప్ర‌భుత్వం. దీనికి పోలీస్ అధికారుల బ‌దిలీలు చాలా ముఖ్యం. అందుకే ఎల‌క్ష‌న్స్ దృష్టిలో పెట్టుకుని ఉన్న‌తాధికారుల స్థాన‌చ‌ల‌నాల ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని తెలుస్తోంది.

పోలీస్ శాఖ‌లో ఎస్పీ నుంచి డీజీ వ‌ర‌కు బ‌దిలీలే!

తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ఏర్పడిన జిల్లాల్లో క‌మిష‌న‌రేట్ల‌లో చాలామంది అధికారులు బ‌దిలీ కాకుండానే ఉన్నారు. స‌హ‌జంగా మూడేళ్లకు ఒక‌సారి బ‌దిలీలు ఉంటాయి. కానీ.. సిద్దిపేట క‌మిష‌న‌ర్, రాచ‌కొండ క‌మిష‌న‌ర్, మ‌హాబూబాబాద్, సిరిసిల్ల ఎస్పీలు ఏడేళ్లుగా ఒకే పోస్టులో ఉంటున్నారు. మ‌రికొంత మందికి ప్ర‌మోష‌న్ వ‌చ్చినా.. ఎస్పీ(డీసీపీ) స్థాయిలోనే ఉన్నారు. హైద‌రాబాద్ వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ డీసీపీల‌కు ఏడాది క్రిత‌మే ప్రమోష‌న్ వ‌చ్చినా అక్క‌డే ఉన్నారు. కొంతమంది స‌మ‌ర్ధ‌మంత‌మైన అధికారులు ఉన్నా.. వారికి ప‌నిలేకుండానే లూప్ లైన్ లో వేసి కూర్చోబెట్టారు. సీఐడీ చీఫ్‌, ఏసీబీ చీఫ్ ఒక్కరే. అయితే ఇప్పుడు స‌మూల మార్పులు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ముఖ్య‌మైన పోస్టులు.. పోటీలు

1. హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్ గా అద‌న‌పు డిజీ లా అండ్ ఆర్డ‌ర్ జితేంద‌ర్ లేదా డిప్యుటేష‌న్ పై సీఐఎస్ఎఫ్ కి వెళ్లి వ‌చ్చి 6 నెల‌ల నుంచి పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న అద‌న‌పు డీజీ సీవీ అనంద్ కి ఈ పోస్ట్ ద‌క్కే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఉన్న సీపీ అంజ‌నీకుమార్ ఏసీబీ డీజీగా బ‌దిలీ అవుతార‌ని టాక్.

2.. రాచ‌కొండ క‌మిష‌న‌ర్ గా ఐజీ నాగిరెడ్డి లేదా ప్ర‌స్తుతం సిటీ క‌మిష‌న‌రేట్ లో ప‌నిచేస్తున్న చౌహాన్ కి ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. సీఐడీ విజిలెన్స్ చీఫ్ గా ప్ర‌స్తుత క‌మిష‌న‌ర్ మ‌హేష్ భ‌గ‌వ‌త్ వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. సీఐడీ, ఏసీబీ డైరెక్ట‌ర్ గా ఉన్న గోవింద్ సింగ్ ను జైళ్ల శాఖ‌కు డీజీగా నియ‌మించ‌నున్న‌ట్లు స‌మాచారం.

3. రాష్ట్ర అడిష‌న‌ల్ లా అండ్ ఆర్డ‌ర్ అద‌న‌పు డీజీగా కొత్త‌కోట శ్రీనివాస్ రెడ్డికి మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఇంటెలిజెన్స్ లో ప‌నిచేసి న‌యీం ఎన్ కౌంట‌ర్ త‌ర్వాత డీజీపీ ఆఫీస్ లో అడ్మినిస్ట్రేష‌న్ చూసుకుంటున్న బీ శివ‌ధ‌ర్ రెడ్డిని గ్రేహౌండ్స్, ఆక్టోప‌స్ అద‌న‌పు డీజీగా బ‌దిలీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

4. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెట‌రీగా ర‌విగుప్తా బ‌దిలీ కానున్నారు.

5. ఈస్ట్‌ జోన్ డీసీపీ ర‌మేష్ రెడ్డి నార్త్ జోన్ డీఐజీగా వెస్ట్ జోన్ ఏఆర్ శ్రీనివాస్ రాచ‌కొండ జాయింట్ సీపీగా సెంట్ర‌ల్ జోన్ విశ్వ‌ప్ర‌సాద్ కొత్త‌గా ఏర్పాట‌య్యే రేంజ్ డీఐజీలుగా రానున్నట్లు తెలుస్తోంది.

6. ఇక సిద్దిపేట క‌మిష‌న‌ర్ కి న‌గ‌రంలో పోస్టింగ్ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఇలా జిల్లాల్లోని ఎస్పీ కేడ‌ర్ కి చెందిన అధికారులు మొత్తం 25 మంది బ‌దిలీ కానున్నారు. న‌గ‌రంలో ప‌నిచేస్తున్న వారిని జిల్లాలకు ఎస్పీలుగా బ‌దిలీ చేయ‌నున్నార‌ట‌. నార్త్ జోన్ డీసీపీతో పాటు రాచ‌కొండ‌, సైబ‌రాబాద్ లో ప‌నిచేసే వారిని జిల్లాలకు పంపించి.. జిల్లాల్లో ఎప్ప‌టి నుంచో ప‌నిచేస్తున్న వారిని హైద‌రాబాద్ కి ర‌ప్పిస్తున్నార‌ని వినికిడి. సీఐడీలో ప‌నిచేస్తున్న అధికారుల‌కు కూడా బదిలీలు ఉండే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఇలా మొత్తంగా.. సుమారుగా 35 మంది జంబో బ‌దిలీ ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఐఏఎస్ ల్లోనూ బ‌దిలీలు

పోలీస్ శాఖ‌లో ఉన్న‌ట్లే ఐఏఎస్ ల‌లో కూడా లాంగ్ టైం అధికారులు ఉన్నారు. సీఎస్ సోమేష్ కుమార్ త‌న బీహార్, యూపీ టీంకే ఎక్కువ శాఖ‌లు అప్ప‌గించి.. ఇంచార్జుల‌తో నెట్టుకొస్తున్నారు. మున్సిప‌ల్ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ అర‌వింద్ కుమార్ కి 5 శాఖ‌లు ఉన్నాయి. ఐ అండ్ పీఆర్, హెచ్ఎండీఏ, రెవెన్యూ స్పెష‌ల్ ఇలా అన్ని కీల‌క ప‌ద‌వుల్లో ఆయ‌నొక్కరే ఉన్నారు. మ‌రో ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే కీల‌కంగా ఉన్నారు. ప్ర‌మోటెడ్ ఐఏఎస్ ల‌కు రూర‌ల్ లో ఎక్కువ ప్రాధ‌న్య‌త ఉన్నా.. లోక‌ల్ స‌మ‌స్య‌ల‌తో భారీగా బ‌దిలీలు ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. 20 మంది ఐఏఎస్ ల బ‌దిలీలు ఒకేసారి ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

గంట వ్య‌వ‌ధిలోనే బ‌దిలీలు ఉండే అవ‌కాశం

సీఎస్ సోమేష్ కుమార్ బ‌దిలీల ఫైల్ ని సీఎం ద‌గ్గ‌ర‌కు చేర్చారు. ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో ఈ బ‌దిలీలు ఆగాయ‌ని స‌మాచారం. బుధ‌వారం సాయంత్రం నుంచి ఏ క్ష‌ణ‌మైనా అనౌన్స్ మెంట్ ఉంటుంద‌ని తెలుస్తోంది.

No comments:

Post a Comment