Wednesday, December 22, 2021

ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం స్వల్పమే.. మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు

ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం స్వల్పమే.. మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు

  • Courtesy by BBC తెలుగు మీడియా ట్విట్టర్    
  • జేమ్స్ గళ్లఘర్
  • బీబీసీ ప్రతినిధి

కరోనా

ఫొటో సోర్స్,GETTY IMAGES

దక్షిణాఫ్రికా, యూకేల్లో ప్రచురితమైన ప్రాథమిక అధ్యయనాల ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం స్వల్పంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌తో ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే అవకాశం తక్కువ మందికే ఉంటుందని గత ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ వేరియంట్‌తో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య దాదాపు 30 నుంచి 70 శాతం తక్కువగా ఉంటుందని అంచనా వేశారు.

ఒమిక్రాన్ ప్రభావం స్వల్పంగానే ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే ఆందోళన మాత్రం అలాగే కొనసాగుతోంది.

యూకేలో తొలిసారిగా ఒకే రోజులో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ తీవ్రతపై లోతైన అవగాహన, వైరస్ పట్ల ఎలా స్పందించాలో నిర్ణయించడంలో దేశాలకు సహాయపడుతుంది.

కరోనా వైరస్‌తో పాటు ఆసుపత్రుల్లో చనిపోతున్నవారి సంఖ్యపై స్కాట్లాండ్ అధ్యయనం చేస్తోంది.


ఒమిక్రాన్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు

ఒకటి: ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే అవకాశం 70 నుంచి 80 శాతం తక్కువ

ఒకవేళ ఒమిక్రాన్ కూడా డెల్టా వేరియంట్ తరహాలోనే ప్రవర్తిస్తే ఇప్పటికే 47 మంది ఆసుపత్రిలో చేరి ఉండాల్సిందని వారు అంచనా వేస్తున్నారు. కానీ అక్కడ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 15 మాత్రమే.

ఆసుపత్రిలో కచ్చితంగా చికిత్స అవసరమయ్యే వారి సంఖ్యలో దాదాపు మూడింట రెండొంతుల తగ్గింపు ఉందని పరిశోధకులు తెలిపారు. కేసులు కూడా తక్కువే నమోదు అవుతున్నాయని, కానీ కొంతమంది వృద్ధులకు దీనివల్ల ముప్పు పొంచి ఉందని అధ్యయనంలో తేలింది.

‘'ఇది అర్హత కలిగిన మంచి వార్త'' అని స్కాట్లాండ్ పబ్లిక్ హెల్త్‌లోని నేషనల్ కోవిడ్-19 ఇన్సిడెంట్ డైరెక్టర్ డాక్టర్ జిమ్ మెక్‌మెనామిన్ వర్ణించారు.

ఈ డేటా అంతా కూడా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గురించే తెలుపుతోంది. కానీ దీన్ని అదునుగా తీసుకొని మనం అజాగ్రత్తగా ఉండకూడదు'' అని ఆయన హెచ్చరించారు.

ఒమిక్రాన్ అసాధారణ వేగంతో వ్యాప్తి చెందుతోంది. ఇది స్వల్ప లక్షణాలు చూపించడం ఇప్పటివరకు మనకు ఊరట కలిగించే అంశం. ఒకవేళ అధిక సంఖ్యలో కేసులు నమోదైతే మాత్రం, స్వల్ప లక్షణాలు కూడా తీవ్ర పరిస్థితులకు దారితీయవచ్చు.

''ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకితే, మిగతా అందరిపై అది చూపించే ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కానీ వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ ఇది మరింత శక్తిమంతంగా తయారవుతుంది. అప్పుడు ఎన్‌హెచ్‌ఎస్‌లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది'' అని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్క్ వూల్‌హౌస్ అన్నారు.

దక్షిణాఫ్రికాలో జరిగిన మరో అధ్యయనం కూడా ఒమిక్రాన్ ప్రభావం స్వల్పంగానే ఉన్నట్లు సూచిస్తోంది.

ప్రస్తుతం ఉనికిలో ఉన్న, గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే అవకాశం 70 నుంచి 80 శాతం తక్కువగానే ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది.

కానీ, కొంతమంది రోగులు మాత్రం, మిగతా వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ వల్ల కూడా ఆసుపత్రుల్లోనే తమ జీవితాలు చాలించాల్సి వచ్చిందని సూచించింది.

''అన్ని అధ్యయనాలను కలిపి చూస్తే ఒమిక్రాన్ తీవ్రత ఇతర వేరియంట్లతో పోలిస్తే తక్కువే అని తెలుస్తోంది. ఇది నిజంగా సానుకూలాంశం'' అని దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రొఫెసర్ చెరిల్ కోహెన్ అన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్

ఫొటో సోర్స్,GETTY IMAGES

రెండు: ఒమిక్రాన్‌ తీవ్రత ఎందుకు తక్కువ?

ఒమిక్రాన్‌గా వైరస్ రూపాంతరంలో మార్పులు, టీకాల వల్ల కలిగిన అధిక స్థాయి రోగ నిరోధక శక్తి కారణంగా ఈ వేరియంట్ మనపై చూపించే తీవ్రత తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

ఒమిక్రాన్ వైరస్‌లో జరిగిన ఉత్పరివర్తనల కారణంగానే ఇది డెల్టా వేరియంట్ కంటే తక్కువ తీవ్రత కలిగిన ఇన్‌ఫెక్షన్‌గా మారిందని లండన్ ఇంపీరియల్ కాలేజ్ విశ్లేషణలో తెలిసింది.

ఒకవేళ సరైన రోగ నిరోధక శక్తి లేకపోయినప్పటికీ, డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల ఎమర్జెన్సీ వార్డుల్లో చేరే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్పారు.

యూకేలో ఇప్పటికే అధిక స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగడం వల్ల చాలా కొద్ది మందికి మాత్రమే ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తుతున్నాయి.

రోగనిరోధక శక్తి వల్ల ఒమిక్రాన్‌తో అత్యవసర చికిత్స పొందే అవసరం 25 నుంచి 30 శాతానికి తగ్గినట్లు, ఒకటి కంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన వారి శాతం 40 శాతం తగ్గినట్లు ఇంపీరియల్ కాలేజ్ అధ్యయనం తెలుపుతోంది.

'' కొంతవరకు వరకు ఇది శుభవార్తే'' అని ప్రొఫెసర్లలో ఒకరైన నీల్ ఫెర్గూసన్ అన్నారు.

''ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తే అవకాశం తక్కువగా ఉన్నంత మాత్రాన దీన్ని తక్కువగా తీసుకోకూడదు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోన్న తీరు చూస్తుంటే ఆసుపత్రుల్లో చేరికలు పెరగడం ఖాయంగా అనిపిస్తోంది. ఈ సంఖ్య పెరిగితే ఎన్‌హెచ్‌ఎస్‌లు కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని ఆయన హెచ్చరించారు.

ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవాలంటే బూస్టర్ డోస్ కావాల్సిందేనా?

మూడు: ‘సాధారణ జలుబుగా మారిపోయిందని చెప్పడం మాత్రం చాలా తప్పు’

ఇంపీరియల్ కాలేజ్ ఇమ్యునాలజిస్ట్ ప్రొఫెసర్ పీటర్ ఓపెన్ షా మరో హెచ్చరిక చేశారు. ''ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రంగా ఉండబోదని ప్రాథమిక లక్షణాలతో తెలిసింది. కానీ ఇప్పటివరకు జరిగిన మూడు అధ్యయనాలు ఈ వేరియంట్, సాధారణ జలుబుగా మారిపోయిందని చెప్పడం మాత్రం చాలా తప్పు'' అని ఆయన అన్నారు.

ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలతో ఉంటుందని చెప్పడానికి సరైన కారణాలను ప్రయోగశాల అధ్యయనాలు సూచించాయి.

శ్వాసమార్గాలపై ప్రభావం చూపడంలో చురుగ్గా పనిచేసే ఒమిక్రాన్ వేరియంట్, ఊపిరితిత్తుల్లోని లోతైన కణజాలాలలోకి ప్రవేశించలేదని హాంకాంగ్ యూనివర్సిటీ పేర్కొంది.

సాధారణంగా ఊపిరితిత్తుల్లో వైరస్ చూపించే ప్రభావం కారణంగా ప్రాణహాని కలుగుతుంది.

వైరస్ వల్ల తీవ్రంగా అనారోగ్యానికి గురైన వ్యక్తుల ఊపిరితిత్తుల్లోని కణాలు బిగుసుకుపోతాయి. ఒమిక్రాన్ వేరియంట్ ఈ తరహా ప్రభావం చూపలేదని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కనుగొంది.

ఒమిక్రాన్‌కు సంబంధించిన డేటాను వీలైనంత త్వరగా ప్రచురించాలని యూకే ఆరోగ్య భద్రతా ఏజెన్సీ భావిస్తోంది. ఇది వేరియంట్ తీవ్రతకు సంబంధించిన మరిన్ని సూచనలు ఇవ్వనుంది

No comments:

Post a Comment