క్యాంపస్‌లు మీ సొత్తు కాదు.. బరాబర్ పోతం
Courtesy by V6 Velugu media Twitter
హైదరాబాద్: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోకి వెళ్లడానికి ఎంట్రీ పాస్ లు పెట్టడంపై మాజీ ఐపీఎస్, బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ అయ్యారు. సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ మంత్రులకు విద్యార్థులను ఎదుర్కొనే ధైర్యం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల దగ్గరకు పోయే దమ్ము కేసీఆర్ కు లేదన్నారు.
పాస్ ఉంటేనే వర్సిటీల్లోకి రావాలని ఆంధ్ర పాలకుల్లాగా కేసీఆర్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. క్యాంపస్ లు ఎవరి సొత్తు కాదని.. అవి రాష్ట్ర ప్రజల ఆశాదీపాలన్నారు. బరాబర్ గా అన్ని క్యాంపస్ లకు పోతామని.. స్టూడెంట్స్ భవిష్యత్ కాపాడుకుంటామని స్పష్టం చేశారు. దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు. ఈ ఫాసిస్టు ప్రభుత్వ పాలనకు ముగింపు పలుకుతామని, క్యాంపస్ లను విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
No comments:
Post a Comment