Wednesday, December 8, 2021

సీడీఎస్ పదవి ఎలా ఏర్పడింది?

సీడీఎస్ పదవి ఎలా ఏర్పడింది?

త్రిదళాధిపతి బిపిన్ రావత్ మృతితో దేశం వ్యాప్తంగా విషాదచాయలు అలుముకున్నాయి. రక్షణ వర్గాలు, రాజకీయ నాయకులే కాదు.. యావత్ ప్రజానికం జరిగిన ఘటపపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సైన్యంలో దిగువ స్థాయి నుంచి 43 ఏళ్లపాటు సేవలందించిన రావత్.. సీడీఎస్ హోదాలో మరణించారు. భారత మొదటి సీడీఎస్ గా ఆయన తరువాత అదే పదవిలో రానున్న వారికి ఒక మార్గదర్శకంగా మారారు.

 

2019లో ఈ పదవిని సృష్టించిన మోదీ ప్రభుత్వం బిపిన్ రావత్ ను ఆ స్థానంలో నిలబెట్టింది. 1971 భారత్‌-పాక్‌ యుద్ధం తర్వాత త్రివిధ దళాలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని.. దీనికి కోసం ఒక కొత్త పదవిని ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. అయితే, కొన్ని సమస్యలు ఈ పదవిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అడ్డుగా మారాయి. 1999 కార్గిల్‌ యుద్ధంలో ఆర్మీకి, వాయుసేనకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. మరోసారి దీనిపై లోతైన చర్చ జరిగింది. ఆ తరువాత చాలా కమిటీలు వాయు, ఆర్మీ, నేవీను సమన్వయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించాయి. లేకపోతే యుద్ధం సమయంలో ఈ మూడింటికి మధ్య సమన్వయ లోపం ఏర్పడుతుందని.. యుద్ధం తీవ్రమైనపుడు ప్రమాదం తలెత్తుతుందని తెలిపాయి.

అటు, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల వంటి దేశాల్లో ఏకైక సైనిక సలహాదారు ఉండటంతో భారత్ లో కూడా ఈ పదవిని ఏర్పాటు చేయడం అనివార్యంగా మారింది. దీంతో, 2019 ఆగస్టు 15న ప్రధాని మోదీ సీడీఎస్ పదవిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సీడీఎస్ విధులు, బాధ్యతలు గురించి తెలియజేసేందుకు ఓ కమిటి కూడా ఏర్పాటు చేశారు. త్రివిధ దళాల కార్యకలాపాలను సమన్వయం చేయడం, ఆయుధ కొనుగోలులో కీలకంగా వ్యవహరించడం, ప్రభుత్వానికి సైనిక సలహాదారుగా వ్యవహరించడం, విదేశాల్లో సైనికులను ఏర్పాటు చేయడంతో పాటు.. యుద్దం సమయంలో నిర్వహించాల్సిన వ్యూహాలు వంటివన్నీ సీడీఎస్‌ విధులుగా ఈ కమిటీ పేర్కొంది. ఈ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిగా బిపిన్ రావత్ రికార్డు కెక్కారు. సీడీఎస్ గానే కాకుండా సైన్యంలో మొత్తం 43 ఏళ్లు దేశానికి సేవలందించారు. ఇక ఈ పదవిలో మరో రెండేళ్లు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన ప్రమాదంలో కన్నుమూశారు.

No comments:

Post a Comment