Wednesday, December 8, 2021

ఎవరీ బిపిన్ రావత్.. సీడీఎస్ స్థాయి వరకు ఎలా ఎదిగారు?

ఎవరీ బిపిన్ రావత్.. సీడీఎస్ స్థాయి వరకు ఎలా ఎదిగారు?

బిపిన్ రావత్.. ప్రస్తుతం గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన పేరు. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? హోదా ఏంటి..? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు నెటిజన్లు. నీలగిరి కొండల్లో హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఎక్కడ చూసినా బిపిన్ రావత్ పేరు వినిపిస్తోంది. ఇండియన్ మిలిటరీలో టాప్ పోస్ట్ లో ఉన్న ఆయన.. 63 ఏళ్ల వయసులో అనుకోని ప్రమాదానికి గురయ్యారు. ఓసారి ఆయన సీడీఎస్ స్థాయికి ఎలా ఎదిగారో చూద్దాం.

బిపిన్ రావత్ పూర్తి పేరు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్.
1978 డిసెంబర్ 16న 5వ బెటాలియన్ లోని లెవెన్ గురుఖా రైఫిల్స్ లో చేరారు.
1978 డిసెంబర్ 16న సెకండ్ లెఫ్టినెంట్ గా పదోన్నది
1980 డిసెంబర్ 16న లెఫ్టినెంట్ గా నియామకం
1984 జులై 31న ఆర్మీ కెప్టెన్ గా బాధ్యతలు
1998 జూన్ 1న లెఫ్టినెంట్ కల్నల్ గా పదోన్నతి
2003 ఆగస్టు 1న కల్నల్ గా బాధ్యతలు
2007 అక్టోబర్ 1న బిగ్రేడియర్ గా బిపిన్ రావత్
2014 జూన్ 1న లెఫ్టినెంట్ జనరల్ గా నియామకం
2017 జనవరి 1న చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా బాధ్యతలు.

ఇలా అనేక పదోన్నతల తర్వాత భారతదేశ మొట్టమొదటి త్రివిధ దళాధిపతిగా 2019 డిసెంబర్ 30న నియమితులయ్యారు రావత్. 40 ఏళ్లుగా దేశ రక్షణలో ఉన్న రావత్ ను పరమ వశిష్ట సేవా, ఉత్తమ్ యుద్ధ సేవా, అతి విశిష్ట సేవా లాంటి పలు పతకాలు వరించాయి.

ఇక బిపిన్ తండ్రి కూడా భారత సైన్యంలో పని చేశారు. ఆయన లెఫ్టినెంట్ జనరల్ గా దేశానికి సేవలందించారు.


No comments:

Post a Comment