Friday, December 3, 2021

ఈనెల 9న బీజేపీలోకి విఠల్

ఈనెల 9న బీజేపీలోకి విఠల్

తెలంగాణ ఉద్యమనేత టి ఎస్ పి ఎస్ సి మాజీ సభ్యుడు విఠల్ బీజేపీలో చేరనున్నారు. ఈనెల 9న ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఉద్యమకారులు బీజేపీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు విలువే లేదని… పదవులు ఉద్యమకారుల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. విఠల్ తో పాటు…తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ తదితరులు కూడా అదే రోజు బీజేపీలో చేరవచ్చని వార్తలొస్తున్నాయి.

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వటంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని…ఇప్పటికైనా కళ్లు తెరిచి 40వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీపై మాట్లాడాలని టి ఎస్ పి ఎస్ సి మెంబర్ హోదాలో సమయం అడిగినా కేసీఆర్ ఇవ్వలేదన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న విఠల్ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత….స్వామిగౌడ్ తో పాటు విఠల్ కూడా టీఆర్ఎస్ లో చేరారు. అయితే టీఆర్ఎస్ విధానాలు, కేసీఆర్ వైఖరినచ్చడంలేదంటూ గతేడాది స్వామిగౌడ్ బీజేపీలో చేరగా…ఇప్పుడు విఠల్ కమలం పార్టీలో చేరనున్నారు.

No comments:

Post a Comment