Courtesy by ఈనాడు మీడియా ట్విట్టర్
చదువే మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. కానీ అందుకు స్థోమత, తగిన సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో అబ్బాయిలు బాల కార్మికులుగా, అమ్మాయిలు చిన్నారి పెళ్లికూతుళ్లుగా అవతారమెత్తుతున్నారు. ఈ రెండూ వారి బంగారు భవిష్యత్తును అణచివేస్తున్నాయని గ్రహించింది బిహార్‌కు చెందిన సదియా రియాజ్ షేక్. వివిధ కారణాల రీత్యా మధ్యలోనే చదువు ఆపేస్తోన్న పేద పిల్లల కోసం ఓ కమ్యూనిటీ గ్రంథాలయాన్ని నెలకొల్పిందామె. పాఠ్యాంశాల దగ్గర్నుంచి పోటీ పరీక్షల దాకా.. విద్యార్థులకు అవసరమైన ప్రతి పుస్తకాన్నీ ఇందులో అందుబాటులో ఉంచింది. ఇలా విద్యార్థి దశలోనే విశాల హృదయంతో ఆలోచించి.. ఎంతోమంది చిన్నారులకు విద్యా దానం చేస్తోన్న సదియా.. తన సమాజ సేవకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు-రివార్డులు అందుకుంది.
జనాభాతో పాటు నిరక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. అక్కడి చాలా గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్నారు. ఎంతలా అంటే.. తమ పిల్లలకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా కొనలేని పరిస్థితి వాళ్లది! దీంతో చిన్న వయసులోనే వాళ్లతో స్కూల్ మాన్పించి.. మగ పిల్లల్ని పనిలోకి, ఆడపిల్లల్ని పెళ్లి చేసి అత్తారింటికీ పంపిస్తున్నారు. అక్కడి దర్భంగా జిల్లాలోని Deora Bandhauli అనే గ్రామం కూడా ఇందుకు మినహాయింపు కాదు. సదియా రియాజ్ షేక్ కూడా అదే గ్రామంలో పుట్టి పెరిగింది.
అవి చూసి చలించిపోయి..!
అయితే సదియా తల్లిదండ్రులు కాస్త స్థితిమంతులే! పైగా వాళ్లకు చదువు విలువ తెలుసు కాబట్టే తమ కూతురికి మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతో ఆమె పుట్టిన మూడేళ్లకే ముంబయికి మకాం మార్చారు. ఆమె తండ్రి అక్కడే చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దీంతో సదియా కూడా అక్కడే చదువుకుంటోంది. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా తన తండ్రి వ్యాపారం మూత పడడంతో కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వచ్చేసింది సదియా. ఆ సమయంలోనే తన గ్రామం గురించి, పేదరికం కారణంగా అక్కడి పిల్లల్ని బలవంతంగా స్కూల్ మాన్పించి వారి బంగారు భవిష్యత్తును కాలరాస్తున్నారన్న విషయాలు తెలుసుకొని చలించిపోయిందామె. అంతటితో ఊరుకోకుండా.. వాళ్లు చదువు ఆపకుండా ఏదో ఒకటి చేయాలనుకుంది. ఇలా ఆలోచిస్తోన్న క్రమంలోనే ‘కమ్యూనిటీ లైబ్రరీ’ ఐడియా ఆమె మదిలో మెదిలింది. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పి.. వారిని ఒప్పించి తన ఊర్లోనే ‘మౌలానా ఆజాద్ లైబ్రరీ’ పేరుతో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది సదియా.

అదే నా లక్ష్యం!
ఇలా కేవలం పుస్తకాలిచ్చి చదువుకోమనడమే కాదు.. పిల్లలకు కొన్ని సబ్జెక్టులను సైతం బోధిస్తోంది సదియా. పిల్లలకు, మహిళలకు ఉండే హక్కులపై అవగాహన కల్పించే క్రమంలో అప్పుడప్పుడూ వర్క్‌షాప్స్, క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తుంటుంది. ‘ఈ గ్రంథాలయాన్ని ఇక్కడితో పరిమితం చేయకుండా.. భవిష్యత్తులో మరింత విస్తరించాలన్న ఆలోచన ఉంది. ఈ క్రమంలో పిల్లలకు కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించాలనుకుంటున్నా.. అలాగే ఇలాంటి గ్రంథాలయాల్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలనుకుంటున్నా..’ అంటోందీ యంగ్ యాక్టివిస్ట్. ప్రస్తుతం తన గ్రంథాలయ నిర్వహణ, ఇతర సేవా కార్యక్రమాల కోసం Rehnuma Welfare Foundation అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. దీని ద్వారా నిధులు సమీకరిస్తోంది సదియా.
సేవకు దక్కిన గుర్తింపు!
ఇప్పుడనే కాదు.. చిన్నతనం నుంచే సేవ చేయడాన్ని ఇష్టపడే సదియా.. గతేడాది బిహార్ వరదల సమయంలో MEEM.org అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసింది. విద్య-ప్రాముఖ్యం, హక్కుల గురించి వివిధ వేదికల పైనా తన గళాన్ని వినిపిస్తూ ఎంతోమందిలో చైతన్యం కలిగిస్తోందీ బిహార్ అమ్మాయి. ప్రస్తుతం ‘Global Kids Rights.org’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోన్న సదియా.. తన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు అందుకుంది. ‘Global Women Inspiration Awards and Conclave 2021’ కు ఎంపికైన వంద మంది స్ఫూర్తిదాయక మహిళల్లో సదియా కూడా ఒకరు కావడం విశేషం.
No comments:
Post a Comment