దేశభద్రత లో రాజీలేని నిర్భయ యోధుడు బిపిన్ రావత్
8డిసెంబర్ 2021 న దక్షిణ భారతదేశం తమిళ రాష్ట్రంలోని వెల్లింగ్‌టన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ లో ఒక ఫంక్షన్ లో పాల్గొనేందుకు భారత వైమానిక దళం హెలికాప్టర్ (Mi-17VH)లో ప్రయాణిస్తూ తమిళ రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలిన సంఘటనలో జనరల్ బిపిన్ రావత్-భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)-ఆయన భార్య మరియు ఇతర రక్షణ సిబ్బంది మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు ఇది దేశానికీ తీరనిలోటు. దేశ విదేశాలలోని అనేకమంది ప్రముఖులు నివాళులు అర్పిస్తూ బిపిన్ రావత్ సేవలు గుర్తు చేసుకొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ”జనరల్ రావత్ అత్యద్భుతమైన సైనికుడు” మరియు “నిజమైన దేశభక్తుడు, భారతీయ సాయుధ బలగాలు మరియు భద్రతా యంత్రాంగాన్ని ఆధునీకరించడంలో వారి భాగస్వామ్యం మరచిపోలేనిదని ” అన్నారు.
“ఓ సైనికుడు మిలిటరీలో ఉన్నంత వరకే సైనికుడు కాదు. వారి జీవితాంతం వారు యోధులుగానే ఉంటారు. జనరల్ బిపిన్ రావత్ ఎక్కడున్నా.. భారత్ కొత్త ఎత్తులకు చేరడాన్ని చూస్తూనే ఉంటారు. భారత్‌ను మరింత శక్తిమంతంగా తయారు చేస్తాం. దేశాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దుతాం.”
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్,బిపిన్ రావత్ అకాల మరణానికి తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తూ, 2008 మరియు 2009లో కాంగోలోని UN శాంతి పరిరక్షక మిషన్ (MONUC)కి నార్త్ కివు బ్రిగేడ్ యొక్క బ్రిగేడ్ కమాండర్‌గా ఉన్నప్పుడు జనరల్ రావత్ “ఐక్యరాజ్య సమితికి విశిష్ట సేవలందించారని” గుర్తు చేసుకున్నారు. అమెరికా అధికారులు కూడా జనరల్ రావత్ మృతికి సంతాపం తెలియచేసారు . ఒక రక్షణ ప్రతినిధి మాట్లాడుతూ “జనరల్ రావత్ విలువైన భాగస్వామి. అతను U.S.-ఇండియా రక్షణ భాగస్వామ్యానికి బలమైన ప్రతిపాదకుడు, అతను రెండు దేశాల మధ్య “వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయటానికి కీలకంగా వ్యవహరించారు “. విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, జనరల్ రావత్ “యుఎస్-భారత్ రక్షణ సంబంధానికి దోహదపడిన అసాధారణమైన నాయకుడు” అని అన్నారు. భారత్‌లోని రష్యా రాయబారి నికోలాయ్ కుదాషెవ్ మాట్లాడుతూ, “మా దేశంతో ప్రత్యేక ద్వైపాక్షిక మరియు విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో పెద్ద పాత్ర పోషించిన అత్యంత సన్నిహిత స్నేహితుడిని రష్యా కోల్పోయింది” అని అన్నారు. భారతదేశంలోని చైనా రాయబారి సన్ వీడాంగ్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మరియు ఇతరుల “విషాద మరణంపై ప్రగాఢ సంతాపం” వ్యక్తం చేశారు. పాకిస్తాన్ నుండి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ రజా మరియు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా జనరల్ రావత్ యొక్క “విషాద మరణం” మరియు “విలువైన ప్రాణ నష్టం” పట్ల “తమ సంతాపాన్ని” తెలియజేశారు. జనరల్ రావత్ మరియు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా 2008లో కాంగోలో UN మిషన్‌లో కలిసి పనిచేశారని గుర్తు చేసుకొన్నారు
అతని సుదీర్ఘ కెరీర్‌లో చేపట్టిన ప్రధాన కార్యాలలో 1)మయన్మార్‌లో 2015 క్రాస్ బోర్డర్ ఆపరేషన్, మరియు అతని నాయకత్వంలోని భారత సైన్యం NSCN-K మిలిటెంట్ల సవాళ్లకు విజయవంతంగా స్పందించింది. 2)పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో (ఉరీ దాడి తరువాత) ఉగ్రవాదులకు వ్యతిరేకంగా 2016 సర్జికల్ స్ట్రైక్ ప్లాన్ చేయడంలో జనరల్ రావత్ కీలక భాగస్వామి మరియు కాశ్మీర్‌లో తదుపరి కార్యకలాపాలు మరియు ప్రణాళికలు, మరియు గాల్వాన్‌లో సంఘర్షణ సమయంలో జరిగిన డోక్లాం చర్చలలో భారత్-చైనా ప్రతిష్టంభన మొదలైనవి చూసారు . జనరల్ రావత్ జాతీయ భద్రతపై సూటిగా “భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద భద్రతా ముప్పు చైనా నుండే ఉన్నది అది పాకిస్తాన్ కంటే చాలా పెద్దది, అని ప్రకటించారు. పాకిస్తాన్ మరియు చైనా రెండింటితో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలపై జనరల్ రావత్ నిర్భయంగా మాట్లాడారు దేశభద్రత విషయం లో రాజీలేని పోరాటం వారిది
No comments:
Post a Comment