Advertisement
యాదాద్రి చారిత్రక ధ్యాన మందిరం
- ప్రజా గాయకుడు గద్దర్
యాదాద్రి, డిసెంబర్ 19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం చారిత్రక ధ్యాన మందిరమని ప్రజా గాయకుడు గద్దర్ అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అద్భుతమైన దేవాలయంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఆదివారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం నూతన ఆలయాన్ని పరిశీలించారు. గద్దర్ మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయాన్ని చైతన్య మందిరంగా ప్రజలు స్వీకరించాలని సూచించారు. యాదాద్రి శిల్పకళను చూస్తే ప్రకృతి దేవతలను ప్రతిష్ఠించినట్టుగా ఉన్నదన్నారు. ‘నర్సన్న.. ఓ నర్సన్న యాదాద్రివయ్యావు’అంటూ గద్దర్ పాడిన పాట విశేషంగా ఆకట్టుకున్నది.
No comments:
Post a Comment