Friday, December 24, 2021

వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే దర్శనానికి అనుమతి

వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే దర్శనానికి అనుమతి


Visitation is permitted only if there is a vaccination or negative certificate: TTD

కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టి.. సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ టీటీడీ అధికారులు శ్రీవారి భక్తులకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. ఇప్పటికే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్పనిస‌రిగా తీసుకుని రావాలని సూచించిన సంగతి తెలిసిందే.. అయితే కొంత మంది భక్తులు టీటీడీ సూచనలను పట్టించుకోకుండా తిరుమల చేరుకుంటున్నారు.

దీంతో టీటీడీ అధికారులు శ్రీవారి భక్తులకు కరోనా నిబంధనలను తప్పని సరిగా పాటించాలని కోరుతున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేదా 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. మలయప్ప దర్శనానికి కొంత మంది భ‌క్తులు నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శనం కోసం వస్తున్నారు. అయితే అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద నిఘా మరియు భద్రతా సిబ్బంది త‌నిఖీ చేసి అటువంటి భక్తులను వెన‌క్కి పంపిస్తున్నారు.

No comments:

Post a Comment