హైదరాబాద్ : 06/07/2021
*తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సర్ గారికి నమస్కారం 🙏.*
సర్ GHMC పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారుల పనితీరు ఏ విధంగా వుందో గమనించగలరు. వారు ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎలా స్పందిస్తున్నారో మీ ఇంటెలిజెన్స్ వారితో పర్యవేక్షిస్తే వాస్తవాలు తెలుస్తాయి.
ఉదాహరణకు *GHMC ఉప్పల్ సర్కిల్* లో *పట్టణ ప్రగతి* భాగంలో ఈరోజు రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ కాలనీలో పర్యటిస్తున్న ఉప్పల్ సర్కిల్ అధికారులు & స్థానిక కార్పొరేటర్ మేడం గారు మరియు కాలనీ సంక్షేమ సంఘము ప్రతినిధుల సమక్షంలో *EE నాగేందర్* గారిని ప్రజా సంకల్పం బృందం స్థానిక ప్రజలు తెలిపిన సమస్యల గురించి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలనుండి *(సుమారు 5 సంవత్సరాలుగా)* పెద్ద సమస్యగా వున్న *UGD* నిత్యం పొంగిపొర్లుతున్న అధికారులు పట్టించుకుంటలేరు అని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన EE నాగేందర్... *మా ఫై అధికారులు చెపితేనే చేస్తాం కావాలంటే నీవు ఎవరికైనా చెప్పుకో మా ఇష్టం* అని అహంకారంగా స్థానిక కార్పొరేటర్ సమక్షంలోనే సమాధానం ఇచ్చిన GHMC ఉప్పల్ సర్కిల్ EE నాగేందర్ గారు. దీనికి ఏ మాత్రం స్పందించని కార్పొరేటర్ మేడం గారు మౌనంగా చూస్తూ వుంది మరి ఎందుకో??. ఇలాంటి అధికారులు పట్టణ ప్రగతి ఏమి చేస్తారు ??.
సర్ ఇలాంటి సంఘటనలు GHMC పరిధిలో దాదాపు అన్ని డివిజన్ లలో జరుగుతూనే వున్నాయి కావున ప్రభుత్వం మీద ప్రజలలో అసహనం ఏర్పడడానికి కారణం అవుతున్న ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.
*Note*: ఈ సమస్య (UGD) గురించి అధికారులుకు గత అయిదు సంవత్సరాలనుండి స్థానిక ప్రజలు తెలియచేస్తూనే వున్నారు అయినా స్పందించని అధికారులు & ప్రజా ప్రతినిధులు.
*Copy to Group link Media*
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg (youTube)
https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment