Tuesday, July 20, 2021

ఇంటర్ లో ఈసారి అతర్గత పరీక్షలు...!

హైదరాబాద్ : 21/07/2021

*ఇంటర్ లో ఈసారి అతర్గత పరీక్షలు...!*

*ఫైనల్‌ పరీక్షలు నిర్వహించుకున్నా* *ఇబ్బంది లేకుండా ఉండేందుకు..*
*ఇంటర్‌బోర్డు యోచన*

హైదరాబాద్‌: ఒకవేళ కరోనా మూడో దశ సంభవించి వచ్చే వేసవిలో నిర్వహించాల్సిన పరీక్షలు జరపడానికి వీల్లేని పరిస్థితి ఉంటే.. అప్పుడు రెండో సంవత్సరం విద్యార్థులకు ఏ ప్రాతిపదికన మార్కులు ఇస్తారు?.. ఇప్పటికే విద్యార్థులకు తొలి ఏడాది పరీక్షలు జరపకుండా రెండో ఏడాదికి ప్రమోట్‌ చేశారు. ఈ క్రమంలోనే పదో తరగతి మాదిరిగా ఇంటర్‌ విద్యార్థులకు అంతర్గత పరీక్షలను జరిపితే ఇబ్బంది ఉండదని ఇంటర్‌బోర్డు భావిస్తోంది.బహుళ ఐచ్ఛిక(మల్టిపుల్‌ ఛాయిస్‌) రూపంలో అంతర్గత పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో జరిపితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో బోర్డు ఉంది. ఈ మేరకు 2021-22 విద్యా సంవత్సరానికి విద్యాకాలపట్టిక రూపొందించే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మొబైల్‌ ఫోన్‌లో కూడా ఆ పరీక్షలను రాసేలా, పరీక్ష ముగిశాక బోర్డుకు ఆ మార్కులు వచ్చేలా చేయాలని భావిస్తున్నారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పరీక్షలు ఎలా జరపాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వార్షిక పరీక్షలు నిర్వహించినా.. అంతర్గత పరీక్షలకు కొంత వెయిటేజీ ఇవ్వొచ్చని, చివరి పరీక్షలు నిర్వహించలేకపోతే 100 శాతం మార్కులకు అంతర్గత పరీక్షల ఆధారంగానే చేయవచ్చన్న దిశగా బోర్డు ఆలోచిస్తోంది.
*ప్రత్యక్ష తరగతులు మొదలైతే అర్ధ*
*సంవత్సర పరీక్షలు?*
కళాశాలలు తెరుచుకుంటే పదో తరగతి తరహాలో అర్ధ సంవత్సరం పరీక్షలను కళాశాలల్లో జరపాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. వాటిని అక్టోబరు చివరి వారంలో చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి టీవీ పాఠాలు ప్రారంభమైనందున అప్పటి నుంచి విద్యా క్యాలెండర్‌గా పరిగణించనున్నారు. ఈసారి కూడా 70 శాతం సిలబస్‌ ఆధారంగానే పరీక్షలు ఉంటాయి. దసరా, సంక్రాంతి సెలవులను కుదించే అవకాశం ఉందని చెబుతున్నారు.

*link Media ప్రజల పక్షం🖋️*

prajasankalpam.blogspot.com

No comments:

Post a Comment