హైదరాబాద్ : 27/07/2021
టీఆర్ఎస్ నేతపై ఘాటుగా స్పందించిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
హుజురాబాద్ గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్… ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా నేతలందరినీ కారెక్కించే పనిలో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ బహిష్కృత నేత పాడి కౌశిక్ రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా టీఆర్ఎస్ భవన్ లో, సీఎం కేసీఆర్ ముందు కౌశిక్ రెడ్డి వాడిన భాష పట్ల రిటైర్డ్ ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు.
కౌశిక్ రెడ్డి తను టీఆర్ఎస్ కండువా కప్పుకున్న తర్వాత తనతో వచ్చిన వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ తో కండువా కప్పించే క్రమంగా ఒక్కొక్కరిని స్టేజ్ పైకి పిలిచారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా… పెద్ద కులాల నాయకులను గారు అని పిలిచి, ఇతర వర్గాల నేతలను మాత్రం పేరుతో ఏకవచనంతో పిలిచారు. కేసీఆర్ చెప్తున్న సమానత్వం ఇదేనా అంటూ ఆ వీడియో వైరల్ అయ్యింది.
తాజాగా ఆ వీడియోను పోస్ట్ చేసిన ప్రవీణ్ కుమార్… ఇలాంటి దురహంకార భావజాలం వల్లే జనాలు బహుజన రాజ్యం కావాలనుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. కౌశిక్ కు తనదైన శైలిలో చురకలంటించారు.
బాపట్ల కృష్ణమోహన్ : సర్ ప్రజాప్రయోజనాలకన్నా స్వలాభం కోసం పార్టీలు మారే ఇలాంటి నాయకులకు విలువలు వుంటే కదా.
హుజురాబాద్ ఓటరు మహాశయులు ప్రజాస్వామ్యన్ని గెలిపిస్తారో లేకపోతే తెలంగాణ ద్రోహులను గెలిపిస్తారో చూడాలి. https://t.co/QrUBAVgiW9
No comments:
Post a Comment