హైదరాబాద్ : 22/07/2021
కేసీఆర్ స్పీచ్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్!
“హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు“ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఓపెన్ స్టేట్‌మెంట్… ఓటర్లను తెగ ఆకట్టుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ చేసిన ప్రకటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. ఉప ఎన్నికకు ఇంత పవర్ ఉంటుందని తాము అనుకోలేదని.. ఆలస్యంగా అయినా తమ కళ్లు తెరిపించారని కొనియాడుతున్నారు. తమకూ వెంటనే అలాంటి సంక్షేమ పథకాలు కావాలని కోరుతూ.. ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలుపెట్టారు.
మొన్నటివరకు టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాత్రమే సోషల్ మీడియాలో పోస్టులు కనిపించేవి. కానీ ఎప్పుడైతే హుజురాబాద్ కోసమే దళిత బంధు అని కేసీఆర్ ప్రకటన చేశారో.. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేల రాజీనామాలకు డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
No comments:
Post a Comment