గతంలో మానవ హక్కుల వేదిక రైతులకు న్యాయం జరగాలని పోరాటం చేసింది.
హైదరాబాద్ : 01/07/2021
మాట తప్పారు.. మంత్రికి నిరసన సెగ!
తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో
మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రాచకొండ కమిషనరేట్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన్ను రైతులు అడ్డుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ కోసం భూములిచ్చిన తమకు న్యాయం ఎప్పుడు చేస్తారంటూ నిలదీశారు.
రాచకొండ కమిషనరేట్ కోసం మేడిపల్లి చెందిన 38 మంది రైతులు 116 ఎకరాల తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. అందులో 56 ఎకరాలను వాడుకుని.. మిగిలిన 60 ఎకరాలను అభివృద్ధి చేసి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పోలీస్ కమిషనరేట్‌ను నిర్మాణం అయితే జరిగింది కానీ.. ఏడేళ్లు గడిచిపోయినా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయింది.
రాచకొండ కమిషనరేట్ ఏర్పడి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా.. అధికారులు హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి వెళ్లగా రైతులు చుక్కలు చూపించారు. తమ సమస్యను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.
No comments:
Post a Comment