హైదరాబాద్ : 20/07/2021
రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త విప్లవం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి మీడియా ట్విట్టర్ సౌజన్యంతో
సాక్షి, దిలాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఐపీఎస్ అధికారి, సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త విప్లవం రాబోతోందని ఆయన అన్నారు. ఈ డెబ్బై, ఎనబై సంవత్సరాలలో అట్టడుగు వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. అక్షరం, ఆర్ధికం, ఆరోగ్యం ఎజెండాగా.. పూలే , అంబేద్కర్, కాన్షిరాం ఆశయాల కోసం పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు.
సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ప్రజల్లో 1 శాతం మార్పు తీసుకువచ్చానని, ఇంకా తొంబై తొమ్మిది శాతం ప్రజల జీవితాలలో మార్పు కోసం పనిచేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజులలో అన్ని వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. సూర్యుడు తూర్పున ఉదయించి.. పశ్చిమాన అస్తమించేది.. ఎంత నిజమో.. ప్రవీణ్ కుమార్ పోటీ చేయకపోవడం అంతే నిజమని అన్నారు. సాంఘీక సంక్షేమ కార్యదర్శిగా గూడెం బిడ్డలు విదేశాలలో చదివేలా ప్రోత్సహించానని, ఇలా అన్ని వర్గాల బిడ్డలు అభివృద్ధి చెందాలనేది తన ఆకాంక్ష అని ఆయన అన్నారు.
praveen kumar sir you need poor pepole jai rsp
ReplyDeleteYes 👍
ReplyDelete