హైదరాబాద్ : 15/07/2021
*5 రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వండి*
*శాఖలు నివేదించిన 56,979 ఉద్యోగ* *ఖాళీలు అసంపూర్తిగా* *ఉన్నాయన్న మంత్రిమండలి*
*ఐటీ శాఖలో నాలుగంటే నాలుగే* *చూపిన అధికారులు*
*ఉద్యోగుల జోనల్* *విభజనకు అనుమతి*
*జిల్లాల వారీగా సంఖ్య నిర్ధారణకు ఆదేశాలు*
హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై వివిధ శాఖలు సమర్పించిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని మంత్రిమండలి అభిప్రాయపడింది. అన్ని విభాగాల నుంచి అయిదు రోజుల్లో పూర్తి సమాచారాన్ని సేకరించి అందజేయాలని సూచించింది. వివిధ ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో 56,979 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నివేదించాయి. ఇందులో 21,507 హోం (పోలీసు) శాఖలో కాగా 10,048 వైద్యఆరోగ్య శాఖ, 3,825 ఉన్నత విద్య, మరో 3,538 బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి.మిగిలిన శాఖల్లో 1,000 కంటే తక్కువ సంఖ్యలోనే ఖాళీన్నాయి. ఐటీ శాఖలో నాలుగంటే నాలుగు ఉద్యోగాలు మాత్రమే భర్తీ కావాల్సి ఉంది. ప్రతి విభాగంలో మంజూరైన పోస్టుల సంఖ్యను, వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీల వివరాలను ఇచ్చారు. దీంతో పాటు వాటిల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వివరాలను అందజేశారు. వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పూర్తి వివరాలు లేవని అభిప్రాయపడ్డారు. పెద్దఎత్తున ఖాళీల భర్తీ చేపడుతున్నందున సమగ్ర సమాచారం అవసరమని పేర్కొన్నారు.
*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com
No comments:
Post a Comment