Saturday, July 24, 2021

ఎడ్యుకేషన్ & కెరీర్ -‌ మేనేజ్‌మెంట్‌ విద్యతో భవిష్యత్తు



ఎడ్యుకేషన్ & కెరీర్‌

మేనేజ్‌మెంట్‌ విద్యతో భవిష్యత్తు

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
మేనేజ్‌మెంట్‌ విద్యతో భవిష్యత్తు

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ).. కొన్ని దశాబ్దాలుగా ఈ కోర్సుకు ప్రాధాన్యం పెరిగింది. దేశంలో వందలాది ఎంబీఏ కాలేజీలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు సుమారు 20 ఉన్నాయి. ఇవి మేనేజ్‌మెంట్‌ విద్యాబోధనలో పేరుపొందాయి. అంతేకాకుండా ఇంకా ఎన్నో కాలేజీలు ఉన్నాయి. 2019లో ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరం దేశంలోని 4,000 బిజినెస్‌ స్కూల్స్‌ నుంచి సుమారు 3,60,000 ఎంబీఏ విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు.

ప్రవేశం ఎలా?

దేశంలో ఎన్నో ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. వాటి ప్రవేశానికి అనేక పరీక్షలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది క్యాట్‌ (సీఏటీ) పరీక్ష. క్యాట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఐఐఎంలు ప్రవేశాలు కల్పిస్తాయి. 1960, 70లలో దేశంలో మొదటగా కోల్‌కతా (వెస్ట్‌ బెంగాల్‌), అహ్మదాబాద్‌ (గుజరాత్‌), బెంగుళూరు (కర్ణాటక)లలో ఐఐఎంలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత లక్నో (ఉత్తరప్రదేశ్‌), కోజికోడ్‌ (కేరళ), ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌), షిల్లాంగ్‌ (మేఘాలయ), రోహతక్‌ (హర్యానా), రాంచి (జార్ఖండ్‌), రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌), తిరుచిరాపల్లి (తమిళనాడు), కాశీపూర్‌ (ఉత్తరాఖండ్‌), ఉదయ్‌పూర్‌ (రాజస్థాన్‌), నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర), అమృత్‌సర్‌ (పంజాబ్‌), బోధ్‌గయ (బీహార్‌), సిర్మౌర్‌ (హిమాచల్‌), సంబల్‌పూర్‌ (ఒడిశా), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌), జమ్ము (జమ్ము అండ్‌ కశ్మీర్‌) ప్రారంభమయ్యాయి.

క్యాట్‌ కోసం అప్లికేషన్‌ చేసుకోవాలనుకునే వారు కనీస మార్కులను గ్రాడ్యుయేషన్‌లో పొంది ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ప్రొఫెషనల్‌ డిగ్రీలైన సీఏ/సీఎస్‌/ఐసీడబ్ల్యూఏ పూర్తిచేసి ఉండాలి. బ్యాచిలర్‌ కోర్స్‌ చివరి సంవత్సరంలో ఉన్నవారు కూడా దీనికి అర్హులే.సాధారణంగా క్యాట్‌ అప్లికేషన్‌ నోటిఫికేషన్‌ జూలై లేదా ఆగస్ట్‌లో విడుదలవుతుంది. రాత పరీక్ష నవంబర్‌ నెలలో ఉంటుంది.

  • రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని తరువాత రౌండ్‌ అయిన గ్రూప్‌ డిస్కషన్‌, రైటింగ్‌ ఎబిలిటీ, ఇంటర్వ్యూ రౌండ్లకి పిలుస్తారు.
  • సెలక్షన్‌ ప్రాసెస్‌లో అదనంగా అభ్యర్థుల మునుపటి అకడమిక్‌ పెర్ఫామెన్స్‌, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ వంటి ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు.
  • రాత పరీక్ష తరువాత ప్రతి ఐఐఎంకి దాని సొంత సెలక్షన్‌ ప్రక్రియ ఉంటుంది.
  • నిర్మా యూనివర్సిటీ, మైకా, టాప్మి, వెలింగ్కర్‌, ఫ్యాకల్టీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, గ్రేట్‌ లేక్స్‌, బిమ్‌టెక్‌ వంటి ఇతర నాన్‌ ఐఐఎం కళాశాలలు కూడా ఈ రాత పరీక్ష స్కోర్లను ప్రవేశాలకు పరిగణలోకి తీసుకుంటున్నారు. నోటిఫికేషన్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని చూడండి.
  • క్యాట్‌ కాకుండా ఇతర ఎంబీఏ ఎంట్రన్స్‌ పరీక్షలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు స్నాప్‌ (ఎస్‌ఎన్‌ఏపీ), గ్జాట్‌ (ఎక్స్‌ఏటీ), ఎన్‌మ్యాట్‌ (ఎన్‌ఎంఏటీ), ఐఐఎఫ్‌టీ.

క్యాట్‌ ప్యాటర్న్‌

క్యాట్‌ పరీక్ష ద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీపీ), ఫెలోషిప్‌ ప్రోగ్రామ్స్‌కు అడ్మిషన్స్‌ ఉంటాయి. ఇతర ప్రోగ్రామ్స్‌కు వేరే అడ్మిషన్‌ ప్రక్రియ ఉంటుంది. పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. అవి వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌. క్యాట్‌ 3 గంటల పరీక్ష. ప్రతి సెక్షన్‌లో సుమారు 32-34 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నలుంటాయి. కానీ కొవిడ్‌ కారణంగా 2020లో దీనిని రెండు గంటలకు కుదించారు. అలాగే 24-26 ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.

  • క్యాట్‌ పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష. దీనిలో ప్రశ్నలు రెండు ఫార్మాట్లలో ఉంటాయి. ఒకటి మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు. రెండోది జవాబు టైపు చేయవలసి ఉంటుంది.
  • ఈ పరీక్షలో సెక్షనల్‌ టైం లిమిట్‌ ఉంటుంది. అంటే ప్రతి సెక్షన్‌ నిర్దిష్ట సమయంలో పూర్తిచేయవలసి ఉంటుంది. అలాగే టోటల్‌ స్కోర్‌తో పాటు ప్రతి సెక్షన్‌లో కనీస మార్కులు తెచ్చుకోవాలి.
  • ఇందులో కొన్ని ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. కొన్నిటికి ఉండదు.

ఎలా ప్రిపేర్‌ కావాలి

వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌

  • ఈ సెక్షన్‌లో ప్రధానంగా ప్యాసేజ్‌ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. కొన్నిసార్లు వొకాబులరీ, గ్రామర్‌ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.
  • ఈ సెక్షన్‌ లో రాణించాలంటే ఇచ్చిన ప్యాసేజ్‌లను సరిగ్గా అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్యాసేజ్‌ సులభంగా ఉన్నా ప్రశ్నలు, ఆప్షన్స్‌ వెరైటీగా ఉండే అవకాశముంది.
  • డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌
  • ఈ సెక్షన్‌లో రాణించాలంటే డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్‌ అవసరం. ఇచ్చిన సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రశ్నలకు స్టెప్‌ బై స్టెప్‌ అప్రోచ్‌ కావాలి. ఎక్కువ పజిల్స్‌ సెట్స్‌ ప్రశ్నలు చేయాలి. క్యాలిక్యులేషన్‌ స్పీడ్‌ పెంచాలి. అలాగే పరీక్షలో సరైన ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. ఆర్టికల్స్‌, న్యూస్‌ చదివినప్పుడు ఇన్ఫర్మేషన్‌ బేస్డ్‌ గ్రాఫ్స్‌లో ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకోవాలి. లాజికల్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

ఫండమెంటల్‌ కాన్సెప్ట్స్‌పై పట్టు పెంచుకోవాలి. ఆ విషయాలు ఎంత లోతుగా నేర్చుకుంటే అంత ఎక్కువ ఉపయోగపడుతుంది. మ్యాథమెటికల్‌ స్కిల్స్‌, ఆక్యురసీ అండ్‌ స్పీడ్‌ ఈ సెక్షన్లో పరీక్షిస్తారు. వేదిక్‌ మ్యాథ్స్‌, షార్ట్‌కట్స్‌, ట్రిక్స్‌ నేర్చుకోవాలి.

ప్రిపరేషన్‌ ఎప్పుడు మొదలుపెట్టాలి?

  • ఇందులో నేర్చుకోవలసిన కాన్సెప్ట్స్‌ అంటే నాలెడ్జ్‌ ఓరియంటెడ్‌ ప్రశ్నలు ఉంటాయి. అలాగే బాగా ప్రాక్టీస్‌ చేయడం వల్ల స్కిల్స్‌ని బట్టి చేయవలసినవి కూడా ఉంటాయి.
  • ఇంజినీరింగ్‌ లేదా గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరంలో ఈ పరీక్ష రాయాలనుకునే వారు ఒక సంవత్సరం ముందునుంచే ప్రిపరేషన్‌ మొదలు పెడుతారు. అలాగే కొంత వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ తరువాత ఉద్యోగం చేయాలనుకునే వారు విద్యార్థి దశలో నాలెడ్జ్‌ పార్ట్‌ కాన్సెప్ట్స్‌ నేర్చుకొని, ఉద్యోగం చేస్తున్నప్పుడు మాక్‌ ఎగ్జామ్స్‌తో ప్రాక్టీస్‌ చేయాలి. ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం ఉన్నప్పుడు సమ్మర్‌లో కాలేజీ పూర్తయిన తరువాత ప్రిపరేషన్‌ ప్రారంభించవచ్చు.
  • సమయాన్ని బట్టి కోచింగ్‌ తీసుకోవచ్చు. సుమారు 25-30 మాక్‌ ప రీక్షలైనా రాసి తప్పులను అనాలిసిస్‌ చేసుకోవాలి.

ఎంబీఏ పట్ల ఆసక్తికి కారణం?

  • ఎంబీఏ విద్యనభ్యసించడానికి కారణాలు అనేకం. కొందరి నిర్ణయం వెనుక కారణం ఉన్నత ఉద్యోగావకాశాలు, ఆసక్తికరమైన జీత భత్యాలు.
  • ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, లా వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చేసిన తరువాత కూడా ఎంబీఏ చేసేవారున్నారు. ఈ కోర్స్‌ ద్వారా నేర్చుకునే స్కిల్స్‌తో ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నాయని, సొంత వ్యాపారం మొదలుపెట్టడానికి కావలసిన జ్ఞానం లభిస్తుందని మేనేజ్‌మెంట్‌ విద్యనభ్యసిస్తున్నారు.
  • ఫ్యామిలీ బిజినెస్‌ ఉన్నవారు కూడా ఈ రంగంపట్ల ఆసక్తి చూపుతున్నారు. వారి వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన మెలకువలు ఎంబీఏ ద్వారా నేర్చుకోవాలనేది వారి ఆశ. కొన్ని కళాశాలలు ఫ్యామిలీ బిజినెస్‌కి అనుగుణంగా కూడా కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి.
  • ఏ సంస్థలోనైనా వాటి అవసరాలకనుగుణంగా వ్యవహారాలను నిర్వహించడానికి మేనేజర్లు అవసరం. కాబట్టి ఎంబీఏ చేసిన వారికి ఎక్కువ కంపెనీల నుంచి ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి.
  • ఒక డిగ్రీగా ఎంబీఏ వల్ల ఒక సంస్థలో మంచి మేనేజర్‌ ఉద్యోగం లభించవచ్చు. కానీ జీతం, ప్రమోషన్లు పూర్తిగా యోగ్యత, కృషిపై ఆధారపడి ఉంటాయి.

ఎలా ఉపయోగపడుతుంది?

  • ఎంబీఏ కోర్సు చాలా బహుముఖమైనది. ఇందులో నేర్చుకున్న విద్య, పెంపొందించుకున్న నైపుణ్యాలు ఒక రంగానికి పరిమితం కావు.
  • టెక్నాలజీ, ఫైనాన్స్‌, మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, వ్యాపారం, వ్యవసాయం లేదా ఆరోగ్య సంరక్షణ వంటి అనేక రంగాల్లో ఎంబీఏ ద్వారా పొందిన నైపుణ్యాలు విస్తృతంగా ఉపయోగపడుతాయి.
  • భారతీయ బిజినెస్‌ స్కూల్స్‌ ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. పరిశోధన, పరిశ్రమల ఆధారిత లైవ్‌ ప్రాజెక్టుల ఆధారంగా ప్రయోగాత్మక, ఆచరణాత్మక అభ్యాసాన్ని అనుసరిస్తున్నాయి.
  • ఎంబీఏలో మార్కెటింగ్‌, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ లేదా హ్యూమన్‌ రిసోర్సెస్‌ వంటి కోర్సుల్లో మక్కువ చూపిన విద్యార్థులు ఆ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. లేదా కన్సల్టెంట్‌లాగా కూడా ఉద్యోగాలు లభిస్తాయి. ప్రాజెక్టులని బట్టి ఏ వ్యాపారంలో ఉన్నవారైనా వీరి అనుభవం, జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఒక కన్సల్టెంట్‌ బ్యాంకింగ్‌ ప్రాజెక్ట్‌ చేయవచ్చు. ఒక ప్రొడక్షన్‌ ప్లాంట్‌ కి సంబంధించిన ప్రాజెక్ట్‌ చేయవచ్చు.
  • ఐఐఎం లలో మొదటి సంవత్సరం చివరగా ఇంటర్న్‌షిప్‌లు చేయవలసి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌ ఎంత బాగా చేస్తే ఆ కంపెనీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ ఇవ్వవచ్చు. అలాగే రెండో సంవత్సరంలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కి ఇంటర్వ్యూలు జరుగుతాయి. అభిరుచిని బట్టి కంపెనీల ఇంటర్వ్యూలకు అటెండ్‌ కావచ్చు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, కన్సల్టింగ్‌, ఈ-కామర్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రియల్‌ ఎస్టేట్‌, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మీడియా టెలికాం, ఇండస్ట్రీ బేస్డ్‌ ఇలా అనేక సెక్టార్‌ల నుంచి కంపెనీలు రావచ్చు. విదేశాల్లో కూడా చాలా అవకాశాలు లభిస్తాయి.
  • Sirisha Reddy
    Director – Academics
    Abhyaas Edu Technologies
    +91 9100545452
    www.abhyaas.in
    GRE | IELTS | CAT

No comments:

Post a Comment