Sunday, July 4, 2021

తెలంగాణ పోలీస్ శాఖలో 19454 కొత్త పోస్టుల భర్తీకి రంగం సిద్ధం.....!

హైదరాబాద్ : 04/07/2021

*తెలంగాణ పోలీస్ శాఖలో 19454 కొత్త పోస్టుల భర్తీకి రంగం సిద్ధం.....!*

*ముందు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులు తర్వాత 425 ఎస్సై*

*19,029 కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీ*
*ఏడాదిగా 8 లక్షల* *మంది నిరీక్షణ*
*కొత్త జిల్లాల* *ఆధారంగా భర్తీ*

హైదరాబాద్‌: ఏడాదిగా ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ శాఖ తీపికబురు చెప్పనుంది. డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 19,454 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ ఏ క్షణంలోనైనా జారీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతకన్నా ముందు.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ)ల నియామకాలను చేపట్టనుంది.ఈ పోస్టుల భర్తీలో ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిన నేపథ్యంలో తొలుత వీటి భర్తీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పోస్టులపై ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో నేడోరేపో నోటిఫికేషన్‌ రానుంది. ఏపీపీల నియామకాల నోటిఫికేషన్‌ తర్వాత టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ నుంచి పోలీసుల భర్తీకి అధికారిక ప్రకటన వెలువడనుంది.
*పోస్టులు ఇవే..*
ఖాళీలపై పోలీసుశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం.. 425 ఎస్సై పోస్టుల్లో.. సివిల్‌లో 368, ఏఆర్‌లో 29, కమ్యూనికేషన్స్‌లో 18.. తదితర ఖాళీలున్నాయి. కానిస్టేబుళ్ల విషయానికి వస్తే.. సివిల్‌ 7,664, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ 6,783, టీఎస్‌ఎస్‌పీ 3,700, 15వ బెటాలియన్‌ 562, కమ్యూనికేషన్‌ 320 పోస్టులు కలుపుకొని... మొత్తంగా 19,454 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. కాగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. కేంద్రం కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం తెలపడంతో కొత్త జిల్లాల ఆధారంగా ఈ పోస్టుల భర్తీ చేయనున్నట్లు సమాచారం.

*link Media ప్రజల పక్షం🖋️*

prajasankalpam1.blogspot.com 

No comments:

Post a Comment